* 25వ తేదీన 10 గంటల ఒంటి గంట వరకు ధర్నా చేసుకునేందుకు హైకోర్టు అనుమతి
* కేవలం వెయ్యి మందితో ధర్నాకు ఛాన్స్
ఆకేరున్యూస్, హైదరాబాద్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ గిరిజన రైతు ధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 25వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ధర్నా చేసుకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. వెయ్యి మంది రైతులతో ధర్నాకు అనుమతి లభించింది. కాగా, గిరిజన రైతు ధర్నా వాస్తవానికి ఈ రోజు చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించగా.. పోలీసులు అనుమతించలేదు. దీంతో గిరిజన రైతు ధర్నాకు అనుమతి ఇవ్వాలని బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది.
……………………………………..