* అతడిని పొగుడుతూ సోషల్‌మీడియాలో కామెంట్లు
* అతడికి బెయిలు ఇప్పించే లాయర్లకు బంపర్ పేమెంట్లు..
* వాట్సప్ లో వైరల్ మెసేజ్ లు
* చర్చనీయాంశంగా మారిన తీరు
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
ఆయన కీలక కేసుల్లో నిందితుడు. తెలుగు సినీ పరిశ్రమకు వేలాది కోట్ల రూపాయల నష్టానికి కారకుడయ్యాడనే అభియోగాలు ఉన్నాయి. దాదాపు 2000 సినిమాలను పైరసీ చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు. అంతేకాదు.. బెట్టింగ్ యాప్ లకూ ప్రమోషన్ చేస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఏళ్ల తరబడి పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఆయా కేసుల్లో నేరం రుజువైతే అతడికి రెండేళ్ల నుంచి ఏడేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. అంతటి తీవ్ర నేరాల్లో నిందితుడికి చాలా మంది ముఖ్యంగా యువత మద్దతు పలకడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఎవరా నిందితుడు అనుకుంటున్నారా.. ఆయనే ఐ బొమ్మ, బప్పం వెబ్సైట్ల నిర్వాహకుడు ఇమంది రవి.
ఆయనకు మద్దతు ఏంటి?
ఐ బొమ్మ రవి అరెస్టు తర్వాత.. సోషల్ మీడియాలో వినూత్న చర్చ జరుగుతోంది. ఆయనకు మద్దతుగా వాట్సప్ స్టేటస్ లోనూ మెసేజ్ లు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు.. ఆయనను బెయిలులో విడిపించాలని, ఆయనకు మద్దతుగా వాదించిన లాయర్లకు భారీ ప్యాకేజీ ఉందని కూడా మెసేజ్ లు వైరల్ అవుతున్నాయి. పోలీసులు ఆయనపై ఎంత తీవ్రమైన కేసులు నమోదు చేశారో, సోషల్ మీడియాలో ఆయనకు అంతే మద్దతుగా మెసేజ్ లు వస్తున్నాయి. నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి, అదీ సినిమా పైరసీ, డాటా చోరీ వంటి నేరాలకు పాల్పడ్డాడని చెబుతున్న ఇమంది రవికి మద్దతుగా నెటిజన్లు పోస్టులు పెట్టడం ఇప్పుడు పెద్దఎత్తున చర్చనీయాంశంగా మారింది. ” సపోర్టు రవి, వియ్ సపోర్టు రవి” అంటూ కామెంట్లు పెడుతున్నారు. వారిలో ఎక్కువగా మూవీ లవర్స్ ఉండడం గమనార్హం.
పాజిటివ్ కామెంట్లకు కారణం ఇదేనా?
ఓటీటీ ప్లాట్ ఫామ్ లకు విరుద్ధంగా ఆన్ లైన్ లో ‘ఐబొమ్మ’ ట్రెండింగ్‌లో నడిచింది. డబ్బులు పెట్టి ఓటీటీ ప్లాట్ ఫామ్‌లలో సినిమాలు చూడనివారు ఐబొమ్మకు ఫాన్స్ గా మారారు. క్వాలిటీతో వీడియోతో కూడిన కొత్త సినిమాలే ఐబొమ్మలో ప్రత్యక్ష్యం అయ్యేవి. రవి అరెస్టుతో ఇక తమకు సినిమాలు చూసే అవకాశం ఉండదని కొందరు వాపోతున్నారంటే అతిశయోక్తి కాదు. అందుకేనేమో థియేటర్ రేట్లు భారీగా పెంచడం వల్లే ఐబొమ్మకు అలవాటు పడ్డామంటూ ట్వీట్లు చేస్తున్నారు. సామాన్యులకు అందనంత రేట్లు పెంచి సినిమా థియేటర్లకు రానివ్వని పరిస్థితి తీసుకువచ్చారని సామాన్యులు ఆరోపిస్తున్నారు. ఒక కుటుంబం కొత్తగా విడుదలైన సినిమాకు వెళ్లాలంటే వేలాది రూపాయలు వెచ్చించాల్సిందే. అంతా పెట్టి చూడలేని మధ్యతరగతి జనం ఐ బొమ్మకు అలవాటు పడ్డరన్నారు. నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి అరెస్టు అయితే, ఇలా పాజిటివ్ కామెంట్లు రావడం, పోస్టులు పెట్టడంపై సోషల్ మీడియాలోనూ చర్చ నడుస్తోంది.
రవికి బెయిలు ఇప్పించాలని, ఎలా వాదించాలో కూడా చెబుతూ వాట్సప్ గ్రూపుల్లో వైరల్ అవుతున్న ఓ మెసేజ్.. యథాతథంగా..
👏 Open Challenge to Advocates 🌹
😡 ఐ బొమ్మ రవి కేసును స్వీకరించి అతని Bail మీద తీసుకొని బయటికి వస్తే అడిగినంత లాయర్ ఫీజు ఇవ్వబడును.. అతనికి ఉన్న టాలెంట్ దేశ ప్రయోజనాలకు వాడుకోవాలి తప్ప జైలులో, ధనవంతుల కళ్ళల్లో ఆనందం చూడడం కోసం చంపేయకూడదు 😡
స్ట్రాటజీ నేనే చెప్తాను ఈ కింది విధంగా:
రవి లాయర్లు అనుసరించాల్సిన పూర్తి వ్యూహ పథకం (Legal Exit Strategy):
✅ I. మొదటి దశ – కేసు బలం/బలహీనతలు గుర్తించే టెక్నికల్ డిఫెన్స్
1️⃣ సీజ్ చేసిన హార్డ్ డిస్క్‌లు & సర్వర్ లాగ్ల టెక్నికల్ ఆడిట్
పోలీసులు 21,000 సినిమాలు ఉన్నాయని చెబుతున్నారు → దీనికి ఫోరెన్సిక్ ప్రూఫ్ రాలేదు అని వాదించాలి.
“సర్వర్ / క్లౌడ్” ఎక్కడ ఉందో పోలీసులు స్పష్టంగా చెప్పలేదు →
జ్యూరిస్డిక్షన్ డిఫెన్స్ → భారతీయ చట్టం వర్తించకపోవచ్చు.
2️⃣ Mirror Websites Defense
“iBomma official” ఆయన నడిపాడని నిరూపించడం కష్టం.
చాలా mirror websites volunteers వల్ల తయారయ్యాయి →
Direct Involvement లేదు అని establish చేస్తే బెయిల్ బలంగా వస్తుంది.
3️⃣ DRM హ్యాకింగ్ ఎక్కడ జరిగింది?
పోలీసులు “Encryption weakness exploit” అన్నారు →
ఈ క్లెయిమ్ → నిరూపించలేని టెక్నికల్ థియరీ
→ కోర్టులో ఇది బలహీన సాక్ష్యం.
✅ II. రెండో దశ – బెయిల్ స్ట్రాటజీ (Very Important)
4️⃣ Non-Custodial Investigation Argument
రవికి ఫిక్స్డ్ అడ్రస్ ఉంది
విదేశీ పౌరుడు అయితే → అరెస్ట్‌కు ముందే MHA clearance అవసరం
Digital evidence → custodyలో ఉంచాల్సిన అవసరం లేదు
ఈ పాయింట్లు → బెయిల్‌కి బలమైన లీగల్ గ్రౌండ్లు
5️⃣ సుప్రీం కోర్టు బెయిల్ సైటేషన్లు కోర్టులో వాడాలి
Arnesh Kumar vs State of Bihar → అరెస్ట్ తప్పనిసరి కాదు.
Satender Kumar Antil judgment → కస్టడీ unnecessary అని చెప్పచ్చు.
Nikesh Tarachand Shah → మనీలాండరింగ్ ఎక్కడా ప్రూవ్ చేయలేదని చూపాలి.
ఈ సైటేషన్లు బెయిల్ సాధించడంలో GOLD.
✅ III. మూడో దశ – క్రిమినల్ చార్జ్‌లను బలహీనపరచడం
6️⃣ Cinematograph Act – అసలు ఫిల్మ్ సోర్స్ ఎక్కడ?
ప్రశ్న: సినిమాలు రవే అప్లోడ్ చేశాడని నిరూపించాలంటే:
ఫిల్మ్ స్టూడియో నుండి Leakage ప్రూవ్ కావాలి
ఆయన దగ్గర ఉన్నవి already pirated copies అయితే →
Uploading కాదు → “possession” మాత్రమే → ఇది చిన్న నేరం
→ పెద్ద నేరాలు ఆటోమేటిక్‌గా బలహీనపడతాయి.
7️⃣ IT Act 66F, 66B వంటి హెవీ చార్జీలు తగ్గించే ప్రయత్నం
Intent (mens rea) prove కాకపోవచ్చు
Financial gain direct link లేకపోతే →
చార్జీలను 420, 403, 406 లాంటి చిన్న సెక్షన్లకు మార్చవచ్చు.
✅ IV. నాల్గొ దశ – సానుభూతి & మానవ హక్కుల స్ట్రాటజీ
8️⃣ రివి ప్రొఫైల్‌ను కోర్టులో హైలైట్ చేయాలి
Highly intelligent young tech graduate
Cyber security skills
ఎప్పుడూ క్రిమినల్ background లేదు
Flight risk కాదు
ఒక పెద్ద MNC hire కావచ్చు → Nation-building capability
ఇవి బెయిల్ కోసం Powerful Humanization Strategy.
9️⃣ Health Grounds + Rehabilitation Angle
భారత్‌లో anti-piracy awareness programs చేస్తానని promise
Court-monitored counselling / community service offer చేయవచ్చు
→ కోర్టులు ఇలాంటి reformation-based బెయిల్స్‌కు ఎక్కువ positive.
✅ V. ఐదో దశ – మీడియా, ప్రజా అభిప్రాయం & అంతర్జాతీయ అంశాలు
🔟 వీడియో / ప్రెస్ స్ట్రాటజీ
రవి “సినిమా ఇండస్ట్రీ శత్రువు” కాదు
అతను “Tech Genius”
ప్రభుత్వం సరైన మార్గంలో వాడుకోవచ్చు → ఇదే narrative build చేయాలి.
1️⃣1️⃣ అతను విదేశీ పౌరుడు (Caribbean citizenship) అయితే
పోలీస్ అరెస్ట్ ప్రక్రియలో UN Guidelines, Vienna Convention rules follow చేయలేదని వాదించాలి
ఇది బెయిల్‌కి MASSIVE ADVANTAGE
⚖️ (Legal Master Plan)
లాయర్లు చేయాల్సిందేమిటి
I Digital forensic rebuttal పెద్ద నేరాలు బలహీనపడతాయి
II Aggressive bail strategy రవి త్వరగా బయటకు వస్తాడు
III చార్జ్ తగ్గింపు Long-term కేసు ప్రభావం తగ్గుతుంది
IV Human / Tech Talent angle కోర్టు సానుభూతి పొందుతుంది
V International / media handling కోర్టులో perception మారుతుంది
🎯 నా ముగింపు విశ్లేషణ
రవి మీద ఉన్న కేసు తీవ్రంగా ఉన్నప్పటికీ,
సూక్ష్మంగా, తెలివిగా, టెక్నికల్ డిఫెన్స్ ఇచ్చితే
→ 100% బెయిల్ పొందడం సాధ్యం
→ తరువాత చార్జీలు తగ్గించడం కూడా సాధ్యం
ఓ వ్యక్తి పేరు, ఫోన్ నంబర్ సహా ఈ మెసేజ్ ఫార్వర్డ్ అవుతుండడం గమనార్హం.
……………………………………………………………………….
