* సంక్రాంతి నేపథ్యంలో దక్షిణమధ్య రైల్వే నిర్ణయం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైటెక్‌సిటీలో 16 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ కల్పించింది దక్షిణమధ్య రైల్వే. సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకొని ఎక్స్‌ప్రెస్ రైళ్లలో దూరప్రాంతాలకు వెళ్లే నగర ప్రయాణికులకు దక్షిణ మధ్యరైల్వే ప్రత్యేక సదుపాయాన్ని తెచ్చింది. సికింద్రాబాద్-లింగంపల్లి మార్గంలో నడిచే 16 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హైటెక్‌సిటీ స్టేషన్లో ప్రత్యేకంగా హాల్టింగ్ ఏర్పాటు చేసింది. సికింద్రాబాద్-లింగంపల్లి(Secundrabad-Lingampally) మార్గంలో నడిచే 16 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హైటెక్‌సిటీ స్టేషన్(Hi Tech city Station)లో నిలిపేందుకు నిర్ణయం తీసుకుంది. జనవరి 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఈ సదుపాయం ప్రయాణికులకు అందుబాట్లో ఉంటుందని దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది. దీంతో దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు వెసులుబాటు కలుగనుంది.
………………………………..
