ఆకేరు న్యూస్, హనుమకొండ: ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు చేపడుతున్న ప్రత్యేక ఓటర్ల సర్వే సవరణ కార్యక్రమం (SIR)లో భాగంగా, వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 244 పోలింగ్ బూత్‌లకు సంబంధించిన బూత్ లెవెల్ ఏజెంట్ల (BLA)దరఖాస్తులను జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఐఏఎస్ కి కాంగ్రెస్ పార్టీ నాయకులు MLAనాయిని రాజేందర్ రెడ్డి ఆదేశాల మేరకు, హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇనుగాల వెంకట్ రామ్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఇ.వి. శ్రీనివాస్ రావు ఈ జాబితాను అందజేశారు.ఎన్నికల ప్రక్రియను అత్యంత సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ పూర్తి సహకారం అందిస్తుందని నాయకులు పేర్కొన్నారు. ఓటర్ల సవరణ ప్రక్రియలో రాజకీయ పార్టీల భాగస్వామ్యం కీలకమని, ఆ బాధ్యతను కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.
………………………………………
