* ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై విచారణ
* మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో విచారణ వాయిదా
ఆకేరున్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్న ఎమ్మెల్యేల అనర్హత అంశం కీలక దశకు చేరుకుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై బీఆరఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, బీజేపీ శాసనసభా పక్ష నేతల ఏలేటి మహేశ్వర్‌రెడ్డి దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్ ఇవాళ అసెంబ్లీలోని తన చాంబర్లో విచారించారు. అయితే, మున్సిపల్ ఎన్నికలు ఉన్నందున విచారణ వాయిదా వేయాలని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి కోరారు. దీంతో స్పీకర్ ఫిబ్రవరి 18న విచారిస్తానని ప్రకటించారు. అయితే, ఇవాళ్టి విచారణకు పిటిషన్ వేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, ఆయన తరఫు న్యాయవాదులు హాజరయ్యారు. మరోవైపు దానం నాగేందర్ తన న్యాయవాదులతో విచారణకు హాజరయ్యారు. కాగా, పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీంకోర్టు విధించిన గడువు రేపటితో ముగియనుండటంతో స్పీకర్ విచారణను వేగవంతం చేశారు. గతంలో ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొన్న మెజారిటీ ఎమ్మెల్యేల పిటిషన్లను స్పీకర్ కొట్టేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు దానం నాగేందర్ విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది స్టేట్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
