ఆకేరు న్యూస్, హనుమకొండ : కాకతీయ ప్రభుత్వ కళాశాల (స్వయంప్రతిపత్తి), హనుమకొండలోని బోటనీ విభాగానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ డా. తిరునహరి యుగంధర్ కు అంతర్జాతీయ స్థాయిలో గౌరవనీయమైన రివ్యూవర్ ఎక్సలెన్స్ అవార్డు లభించింది. అంతర్జాతీయ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఇన్ బయోలాజికల్ సైన్సెస్ జర్నల్ సంస్థ, సమీక్షకుడిగా డా. యుగంధర్ గారు అందించిన అంకితభావ సేవలను గుర్తించి ప్రదానం చేసింది. ఈ అవార్డు కు సంబంధించిన సర్టిఫికేట్ హార్డ్ కాపీ,మెమెంటోను జర్నల్ మేనేజర్ నుండి పోస్టు ద్వారా ఈ రోజు స్వీకరించారు. అనంతరం, ఈ అవార్డు సర్టిఫికేట్, మెమెంటోను కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కే రజనీలత అసోసియేట్ ప్రొఫెసర్ డా. తిరునహరి యుగంధర్ కుఅధికారికంగా అందజేశారు.ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, డిగ్రీ కళాశాలల అధ్యాపకుల్లో ఇటువంటి రివ్యూవర్ అవార్డును పొందిన వారు చాలా కొద్దిమంది మాత్రమే ఉండగా, ఆ గౌరవాన్ని సాధించిన వారిలో డా. యుగంధర్ ఒకరని పేర్కొన్నారు. ఇది కళాశాలకే కాకుండా బోటనీ విభాగానికి కూడా గర్వకారణమని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో బోటనీ విభాగాధిపతి, డాక్టర్ కి ఈ కోమల, డాక్టర్ శ్యాం ప్రసాద్ డాక్టర్ సమ్మయ్య డాక్టర్ ఘన సింగ్ డాక్టర్ నరేందర్, డాక్టర్ భరత్ లైబ్రరీ కోఆర్డినేటర్ డాక్టర్ వెంకటరమణ రీసెర్చ్ కోఆర్డినేటర్ శ్రీనాథ్ రవికుమార్ స్టాఫ్ క్లబ్ సెక్రటరీ, డాక్టర్ పి దినకర్ అధ్యాపకులు మరియు ఇతర సిబ్బంది పాల్గొని డా. యుగంధర్ గారిని హృదయపూర్వకంగా అభినందించారు. అంతర్జాతీయ పరిశోధనా రంగంలో కళాశాల పేరు ప్రతిష్ఠలను పెంచడంలో ఆయన చేసిన సేవలు ప్రశంసనీయమని వారు అభిప్రాయపడ్డారు.
……………………………………………….

