Hanamkonda HP Petrol Bunk Fire accident
ఆకేరు న్యూస్, హనుమకొండ :పెట్రోల్ బంకులో చెలరేగిన మంటలు
హనుమకొండ బాలసముద్రంలోని లక్ష్మీ ఫిల్లింగ్ స్టేషన్లో పెట్రోల్ లీకేజీ కారణంగా శనివారం మంటలు చెలరేగాయి. ఘటనను గమనించిన పెట్రోల్ బంక్ సిబ్బంది అప్రమత్తమై వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వేగంగా సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సిబ్బంది సమయస్ఫూర్తితో స్పందించారు.
