* ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి
ఆకేరు న్యూస్, హనుమకొండ: ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ పి .ప్రావీణ్య (Hanmakonda District Collector P. Pravinya) పిలుపు నిచ్చారు. హన్మకొండ లోని కాకతీయ వైద్య కళాశాల (Kakatiya Medical College) లో శుక్రవారం ట్రైబ్ సంస్థ (Tribe organization) ఆధ్వర్యంలో నిర్వహించిన 75వ వన మహోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. భావితరాల మనగడకై కాలుష్య రహిత సమాజాన్ని నిర్మించేందుకు విరివిగా మొక్కలు నాటాలని కోరారు. ఒక యజ్ఞం లాగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించాలని పిలుపు నిచ్చారు. చెట్లను పెంచడం ద్వారానే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని అన్నారు. మొక్కల పెంపకం ఆవశ్యకత గురించి ప్రజా చైతన్య కార్యక్రమాలను నిర్వహించాలని వైద్య విద్యార్థులకు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సూచించారు.
మానవ మనుగడకు మొక్కలే మూలాధారమని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ రిజిష్ట్రార్ డాక్టర్ సంధ్యా రాణి (Health University Registrar Dr. Sandhya Rani) అన్నారు .ప్రతి విద్యార్థి సవాల్ గా స్వీకరించి వన మహోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కేఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ దాస్ (KMC Principal Dr. Mohan Das) కోరారు. కేయంసీ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రాం కుమార్ రెడ్డి KMC Vice Principal Dr. Ram Kumar Reddy), ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ సురేందర్, విశ్రాంత డి ఎఫ్ ఓ పురుషోత్తం , డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, శ్రవణ్లతో పాటు వైద్య విద్యార్థులతో కలిసి కేయంసీ ఆవరణలో జిల్లా కలెక్టర్ మొక్కలు నాటారు.మొక్కలు నాటి సంరక్షితామంటూ వైద్య విద్యార్థులతో ప్రతిజ్ఞ చేశారు.
——————————–