* పర్యావరణ పరిరక్షణకై వన మహోత్సవ కార్యక్రమం అభినందనీయం.
* హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
ఆకేరు న్యూస్ , కమలాపూర్ :
రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరూ వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని చెట్లను నాటి , పర్యావరణ పరిరక్షణ చేపట్టాలని హుజురాబాద్ (Huzurabad) ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (MLA Padi Kaushik Reddy) అన్నారు. కమలాపూర్ మండలం (Kamalapur Mandal) లోని మహాత్మ జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాల (Jyotibapoole Boys Gurukula School) లో శుక్రవారం వన మహోత్సవ కార్యక్రమాన్ని (Vana Mahotsava programme) ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హాజరై పాఠశాల ఆవరణలో చెట్లని నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో గ్రీన్ స్టేట్ (Green State) గా తీర్చిదిద్దిందని, అదే బాటలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) కూడా వన మహోత్సవ కార్యక్రమాన్నీ చేపట్టడం అభినందనీయం అని అన్నారు. మాజీ సిఎం కేసీఆర్ (Former CM KCR) 10820 కోట్ల వ్యయంతో దాదాపు 273 కోట్ల మొక్కలు పెంచరాన్నారు. గ్రామాల్లో 19472 పల్లె ప్రకృతి వనాలను అభివృద్ధి చేశారని గుర్తుచేశారు. గురుకుల విద్యాలయాలు ప్రైవేటు పాఠశాలల కంటే దీటుగా విద్యను అందిస్తున్నాయని, పాఠశాలలోని విద్యార్థులందరూ ఈ సౌకర్యాలను అందిపుచ్చుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని విద్యార్థులకు సూచించారు. పాఠశాల మినీ స్టేడియం నిర్మాణానికి కృషి చేస్తానని అన్నారు.
కార్యక్రమంలో కమలాపూర్ ఎంపీడీవో గుండె బాబు, బీసీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్, మండల ప్రత్యేక అధికారి రాం రెడ్డి ,గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ తాడూరి రవీందర్, అసిస్టెంట్ ప్రిన్సిపాల్ మంగా ,డిప్యూటీ వార్డెన్ సరిత భాయి, ఏఎన్ఓ విజయ్ ,ఎన్ సీసీ కాడెట్స్,ఉపాధ్యాయులు, మాజీ సర్పంచ్ అంకతి సాంబయ్య, తదితరులు పాల్గొన్నారు.
—————————