
* వైద్యుల సలహా మేరకు గర్భిణులు యోగా చేయవచ్చు
* మొదటి మూడు నెలలు యోగాకు దూరంగా ఉండాలి
ఆకేరు న్యూస్ డెస్క్ ః యోగాసనాలు మన పూర్వీకులు మనకు ఇచ్చిన గొప్ప వరం.. యోగాతో వందేళ్లు జీవించిన వారు ఉన్నారు.యోగాతో ఆత్మస్తైర్యం పెరుగుతుంది.రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, భౌతికంగా మానసికంగా సుఖంగా ఉంటారు. అయితే యోగాను అందరూ చేయవచ్చా..? ముఖ్యంగా గర్భిణులు యోగా చేయవచ్చా అనే సందేహం కలుగుతుంది.. గర్భిణులు కూడా యోగా చేయవచ్చు అని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు.అయితే డాక్టర్ సలహా మేరకు యోగా చేయాలని సూచిస్తున్నారు.యోగా చేయడం వల్ల శరీరం ఫ్లెక్సీబుల్ గా మారుతుంది. ఒత్తిడి దూరం అవుతుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది. అలాగే, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కండరాలు బలంగా మారుతాయి. ఇంకా దీర్ఘకాలిక అనారోగ్యాలను నివారించడంలో కూడా యోగా ఉపయోగపడుతుంది.
యోగాతో నార్మల్ డెలివరీ
గర్భిణులు యోగా చేస్తే నార్మల్ డెలివరీ కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు
సూచిస్తున్నారు. ప్రెగ్నెన్సీ టైంలో యోగా చేయడం మంచిదేనా? దీని వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? ఈ విషయంపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
గర్భిణులకు యోగా గర్భధారణ సమయంలో శారీరక, మానసిక ఆరోగ్యానికి సహాయపడుతుందని చెబుతున్నారు. అయితే, యోగా ప్రారంభించే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిదని, ముఖ్యంగా ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యుడి సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు…నిపుణుల ప్రకారం, యోగా భంగిమలు కండరాలను బలోపేతం చేస్తాయి. నొప్పులను తగ్గిస్తాయి. ప్రసవానికి శరీరాన్ని సిద్ధం చేస్తాయి. యోగా ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమిని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. యోగా ద్వారా శ్వాస వ్యాయామాలు, భంగిమలు నేర్చుకోవడం వల్ల ప్రసవ సమయంలో సులభంగా ఉంటుంది. నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుందని వైద్యలు సూచిస్తున్నారు.
మొదట్లో జాగ్రత్తగా ఉండాలి
గర్భం వచ్చిన తరువాత 12 వారాలపాటు యోగా చేయడం మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు ఎందుకంటే, ఈ సమయంలో కడుపులో బిడ్డ అభివృద్ధి శరవేగంగా జరుగుతుంది. కాబట్టి విశ్రాంతి తీసుకోవడం అవసరం. అయితే, డాక్టర్ అనుమతిస్తే తేలికపాటి శ్వాస వ్యాయామాలు చేయవచ్చు అని సూచిస్తున్నారు.
………………………………….