* బీఆర్ఎస్ నేతల ధర్నా
* స్టేషన్లో కౌశిక్‌రెడ్డిని పరామర్శించిన ఎర్రబెల్లి
ఆకేరు న్యూస్, వరంగల్ : వరంగల్ (Warangal ) సుబేదారి పోలీసు స్టేషన్ ఎదుట ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పరామర్శించడానికి బీఆర్ఎస్ నేతలు తరలివస్తున్నారు. ఎర్రబెల్లి దయాకర్ కౌశిక్ రెడ్డిని పరామర్శించారు. దాస్యం వినయ్ భాస్కర్, రాకేశ్ రెడ్డి తదతరులు కూడా పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు వారిని లోపలికి వెళ్లకుండా స్టేషన్ బయటే అడ్డుకున్నారు. పోలీసులకు, బీఆర్ఎస్ (BRS) నాయకులకు వాగ్వాదం చోటుచేసుకున్నది. తమను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. దీంతో పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఇదిలాఉండగా, వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో బీఆర్ స్ నేతలు సీపీని కలిశారు. పాడి కౌశిక్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
…………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
