
ఆకేరు న్యూస్, ములుగు: 79 వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తాడ్వాయి మండల కేంద్రం లో హర్ ఘర్ తిరంగ ర్యాలీ మండల అధ్యక్షులు తాళ్లపల్లి లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా బీజేపీ జిల్లా అధ్యక్షులు సిరికొండ బలరాం , మండల ఇంచార్జి పళ్ళ బుచ్చయ్య హాజరై జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి తాడ్వాయి బస్ స్టాండ్ వరకు హర్ ఘర్ తిరంగ ర్యాలీ నిర్వహించారు ..ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సిరికొండ బలరాం మాట్లాడుతూ 79 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రపంచ దేశాలకు భారతదేశం యొక్క శక్తిని చాటిన సైనికుల వీరత్వానికి ప్రతికగా నిలిచిన సైనికుల వీరత్వానికి ఆపరేషన్ సింధూర్ పట్ల గర్వంతో ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటుదాం అని పిలుపు ఇచ్చారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో భారత దేశం విశ్వ గురుగా ఆవిర్భవించి ప్రపంచదేశాలు అన్ని కూడా భారత దేశానికి తలవంచే పరిస్థితి ఉంది అని అని అన్నారు. దేశమంటే భారతదేశం పౌరులు అంటే భారతీయులు ప్రపంచ దేశాలు కూడా నేడు భారతదేశం వైపు ఎదురుచూస్తున్నాయి. మేకింగ్ ఇండియాతో ప్రపంచంలోనే మూడవ ఆర్ధిక వ్యవస్థగా భారత దేశం నిలవడం మనందరి ఉమ్మడి విజయం అని పేర్కొన్నారు. భారత సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమని అన్నారు. ప్రపంచ దేశాలలో కూడా ఈరోజు జైశ్రీరామ్ అనే నినాదాలతో రామ నామం ఉండాలని కోరుకుంటూ ప్రపంచ దేశాలు కూడా హిందుత్వాన్ని స్వీకరించిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో 72 సంవత్సరాల పాలనలో భారత్ దేశం యొక్క సంస్కృతి సంప్రదాయములను పాతివేసిందని అన్నారు. మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలను దేశభక్తిని ప్రతి ఒక్క భారత పౌరునికి అంకితం చేసే విధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు పరిపాలన చేస్తున్నారని అన్నారు. ఈరోజు ఆపరేషన్ సింధూర్ విజయాలతో ప్రపంచ దేశాలకు కూడా భారతదేశం యొక్క ధైర్య సాహసాలను ప్రపంచ దేశాలకు చూపించిన ఘనత భారత సైన్యందని అన్నారు. భారతదేశాన్ని హిందూ భారతదేశంగా తీర్చిదిద్దడమే భారతీయ జనతా పార్టీ యొక్క అంతిమ లక్ష్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి భర్తపురం నరేష్, రాష్ట్ర గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్, జిల్లా ఉపాధ్యక్షులు జినుకుల కృష్ణాకర్ రావు, మరియు మల్లెల రాంబాబు, జిల్లా sc మోర్చా అధ్యక్షులు వావిలాల జనార్దన్ నియోజకవర్గ కన్వీనర్ జాడి వెంకట్, జిల్లా కార్యదర్శి మెడిశెట్టి ఓంబ్రా, జిల్లా కౌన్సిల్ మెంబెర్ డ్యాగల సలేందర్ జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి జంగా హన్మాంతరెడ్డి జిల్లా గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శి సిద్దబోయిన సురేందర్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు భూక్యా శ్రీను, మండల కోశాధికారి అలకుంట చిన్న, బూత్ అధ్యక్షులు చెవుగాని రఘబాబు మండల పార్టీ నాయకులు జీడీ ప్రశాంత్ వర్దెల్లి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
………………………………………