ఆకేరు న్యూస్, ములుగు: ప్రపంచ ప్రసిద్ధ మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరను పురస్కరించుకొని చేపట్టిన పారిశుధ్య నిర్వహణపై పంచాయతీరాజ్, శానిటేషన్ శాఖల సిబ్బందితో మంత్రి దనసరి అనసూయ సీతక్క మేడారంలో ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
జాతరను పరిశుభ్రంగా, సురక్షితంగా నిర్వహించడంలో పారిశుధ్య సిబ్బంది సేవలు అనిర్వచనీయమని మంత్రి ప్రశంసించారు. జాతర ముగిసిన అనంతరం కూడా మేడారం, రహదారులు, గద్దెల ప్రాంగణాలు, భక్తుల బస ప్రాంతాలు పూర్తిగా శుభ్రం అయ్యే వరకు క్షేత్రస్థాయిలో పనులు కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. గ్రామస్తులకు స్వచ్ఛమైన మేడారాన్ని అప్పగించేలా సమన్వయంతో పనిచేయాలని మంత్రి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ దివాకర అదనపు కలెక్టర్ మహేందర్ జీ, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు జోనల్ సెక్టోరియల్ అధికారులు తదితరులు ఉన్నారు.
………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
