*22లక్షల రూపాయల విలువైన బంగారం
*రెండు ద్విచక్ర వాహనాలు, 50వేల రూపాయల నగదు స్వాధీనం
ఆకేరు న్యూస్, హనుమకొండ : సొంత ఇంటి నిర్మాణంతో పాటు దుబాయ్‌కు వెళ్ళేందుకు చోరీలకు పాల్పడతున్న అంతర్ జిల్లా దొంగను సీసీఎస్ , మట్వాడ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి సుమారు 22లక్షల రూపాయల విలువైన 270 గ్రాముల బంగారు అభరణాలతో పాటు, రెండు ద్విచక్ర వాహనాలు, 50వేల రూపాయల నగదు, ఒక మోబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ అరెస్టుకు సంబందించి వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా (Amber Kishore Jha) వివరాలను వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ మండలం, సంకేపల్లి గ్రామం, ప్రస్తుతం సిద్దిపేట జిల్లా చేర్యాలలో నివాసం వుంటున్న జింక నాగరాజు ద్విచక్ర వాహన మెకానిక్‌గా పనిచేస్తూనే ద్విచక్ర వాహనాల క్రయ విక్రయాలతో వచ్చే అదాయం తన జల్సాలకు సరిపోక పోవడంతో పెద్ద మొత్తంలో డబ్బును సులభంగా సంపాదించాలనే ఆలోచనతో ద్విచక్రవాహనాలు చోరీ చేసి వాటిని అమ్మి డబ్బును జమ చేయలనుకున్నాడు.
* దొంగతనమే వృత్తిగా..
2011 నుంచి కరీంనగర్,జమ్మికుంట,కామారెడ్డి,సిద్దిపేట,వేములవాడతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడి పోలీసులకు చిక్కి జైలు పాలైనాడు. జైలు జీవితం అనంతరం కూడా నిందితుడిలో ఎలాంటి మార్పు రాకపోగా, ద్విచక్రవాహనాలు చోరీలకు స్వస్తి పలికి తాళం వేసి వున్న ఇండ్లల్లో చోరీలు చేస్తున్నాడు. 2016 సంవత్సరం నుంచి 2022 వరకు నాగరాజు వరంగల్, జనగాం, సిద్దిపేట, భూపాలపల్లి జిల్లాల్లో మొత్తం 38కి పైగా తాళం వేసివున్న ఇండ్లల్లో దొంగతనం చేశాడు. పోలీసులు పలుమార్లు అరెస్టు చేసి జైలుకు తరలించారు. గత సంవత్సరం మార్చి నెలలో జైలు నుంచి విడుదలయినాడు. తన సొంత ఇంటి నిర్మాణంతో పాటు, దుబాయికి వెళ్ళేందుకు అవసరమయిన డబ్బును సంపాదించాలనే లక్ష్యంగా చోరీలకు పాల్పడినాడని విచారణ లో తెలిపాడు.
*దొంగతనాల పరంపర
వరంగల్ పోలీస్ కమిషనరేట్(Warangal Police Commissionerate) పరిధితో పాటు జగిత్యాల, యాదాద్రి జిల్లాలో మొత్తం 20 చోరీలకు పాల్పడ్డాడు. ఇందులో మట్టెవాడ, మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్ల పరిధిలో రెండు చోప్పున అలాగే ఇంతేజార్గంజ్, కెయూసి, హనుమకొండ, ఐనవోలు, నల్లబెల్లి, జనగాం, బచ్చన్నపేట పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒకటి చోప్పున తాళం వేసి వున్న ఇండ్లల్లో చోరీలకు పాల్డడగా, మట్వాడా, సుబేదారి పోలీస్ స్టేషన్ల పరిధిలో రెండు ద్విచక్రవాహనాలు చోరీ చేయగా, జగిత్యాల నాలుగు చోరీలు, యాదాద్రి ఒక చోరీకి నిందితుడు పాల్పడ్డాడు. ఈ చోరీలపై అప్రమత్తమైన పోలీసులు వరంగల్ పోలీస్ కమిషనర్ అదేశాల మేరకు ట్రైనీ ఐపీఎస్ శుభం నాగ్ అధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
చోరీలు జరిగిన ప్రదేశాల్లో పోలీసులకు లభించిన అధారాలతో పాటు ప్రస్తుతం పోలీసుల వద్ద వున్న టెక్నాలజీని వినియోగించి నిందితుడుని గుర్తించిన పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఈ రోజు నిందితుడు చోరీ చేసిన బంగారు అభరణాలను అమ్మేందుకు ద్విచక్రవాహనంపై వస్తున్నట్లుగా పోలీసులకు పక్కా సమాచారం రావడంతో నిందితుడిని పట్టుకోనేందుకు మట్వాడా, సిసిఎస్ పోలీసులు సంయుక్తంగా ఆర్.ఎన్.టి రోడ్డు వాహన తనీఖీలు నిర్వహిస్తుండగా ద్విచక్రవాహనంపై వస్తున్న నాగరాజును పోలీసులు తనీఖీ చేయగా అతడి వద్ద బంగారు అభరణాలు, పెద్ద మొత్తం నగదు లభించడంతో అదుపులోకి తీసుకోని విచారించగా తాను చేసిన చోరీలను పోలీసుల ఎదుట అంగీకరించాడు
* సీపీ అభినందన
నిందితుడుని పట్టుకోవడంలో ప్రతిభ కనభరిచిన ట్రైనీ ఐపీఎస్ శుభం నాగ్‌తో పాటు సెంట్రల్ జోన్ డీసీపీ అబ్దుల్‌బారీ, అదనపు డీసీపీ రవి, వరంగల్ ఏసీపీ నందిరాంనాయక్, సిసిఎస్, మట్వాడా ఇన్స్‌స్పెక్టర్లు అబ్బయ్య, గోపి, అసిస్టెంట్ అనాలిటికల్ అఫీసర్ సల్మాన్‌పాషా, సిసిఎస్ ఏఎస్ఐ శివకుమార్, హెడ్‌కానిస్టేబుళ్లు నజీం, ఆహ్మద్, జంపయ్య, కానిస్టేబుళ్ళు మధుకర్, రాములు, వెంకన్న,కిరణ్‌కుమార్, నజీరుద్దీన్, శ్రీకాంత్‌తో పాటు మట్వాడా ఎస్.ఐ కుమార్ కానిస్టేబుళ్ళు అలీ, హరికుమార్ రాజేందర్, ఐటీకోర్ టీం కానిస్టేబుళ్ళు నగేష్, ప్రవీణ్‌లను వరంగల్ పోలీస్ కమిషనర్ అభినందించారు.
———-