* సామ రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాలు మరో సారి హీటెక్కాయి. తెలంగాణ లో కమలం పార్టీ పగ్గాలు త్వరలో హరీష్ రావు చేతికి రానున్నాయని టీపీసీసీ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ ఛైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.. తెలంగాణలో బీజేపీ బలపడాలంటే బలమైన నాయకుడు కావాలనే యోచనలో బిజేపీ పెద్దలు ఉన్నారని రామ్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పటికే బీజేపీ పార్టీకి హరీష్ రావు రిమోట్ కంట్రోల్ గా పనిచేస్తున్నారని ఆయన అన్నారు. హరీష్ రావు చేతిలో రాష్ట్ర బీజేపీ నేతలు కీలు బొమ్మలుగా మారారని ఆయన వ్యాఖ్యానించారు. కేటీఆర్ ని కాదని కేసీఆర్ హరీష్ రావుకు అధిక ప్రాధాన్యం ఇచ్చే అవకాశం లేదు. ఈ నేపధ్యంలో హరీష్ రావుకు రాష్ట్ర బీజేపీ పగ్గాలు అప్పజెప్పనున్నారని టీపీసీసీ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ ఛైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
………………………………………………

