
– ఎంపీడీవో గుండె బాబు
ఆకేరు న్యూస్, కమలాపూర్ : మండల వ్యాప్తంగా వారానికి రెండు రోజులు డ్రై డే ను విధిగా పాటిస్తూ నీరు నిల్వ ఉండకుండా ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకోవాలని కమలాపూర్ ఎంపీడీవో గుండె బాబు అన్నారు. శుక్రవారం కస్తూరిబా పాఠశాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు.అనంతరం ఉప్పల్లో ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి, రోగులకు అందుతున్న వైద్య సేవలను డాక్టర్, ఆసుపత్రి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను మండల ప్రత్యేక అధికారి లక్ష్మణ్ తో పాటు పరిశీలించారు. ఆసుపత్రి, గ్రామ పంచాయతీ సిబ్బందితో కలిసి ఉప్పల్ లోని ఇండ్లలో డ్రై డే నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపీడీవో గుండె బాబు మాట్లాడుతూ, వారంలో తప్పనిసరిగా ప్రతి మంగళ, శుక్రవారాలలో ఇండ్లలో డ్రై డే నిర్వహించాలని సూచించారు.వర్షాకాలంలో దోమల కారణంగా డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని, ప్రజలు ప్రతి ఒక్కరు తమ ఇంటి పరిసరాలలో పరిశుభ్రతను పాటించాలని, తద్వారా వ్యాధులను నివారించవచ్చని అన్నారు.
……………………………………….