
*జనాల మీదకు లారీని తీసుకెళ్లిన డ్రైవర్
*మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఘటన
* ప్రమాదంలో ముగ్గురు మృతి,పలువురి గాయాలు
ఆకేరు న్యూస్ డెస్క్ : చిత్తుగా తాగి జనాల మీదకు లారీని తీసుకెళ్లాడు ఓ ప్రభుద్దుడు.మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇండోర్ పట్టణంలోని రామచంద్ర నగర్ ఇంటర్సెక్షన్ ఓ లారీ డ్రైవర్ మద్యం మత్తులో లారీని అదుపుచేయలేక జనాల మీదకు తీసుకెళ్లి నానా భీభత్సం సృష్టించాడు. అడ్డుగా ఉన్న ద్విచక్ర వాహనాల మీద నుండి లారీని తీసుకెళ్లాడు. వేగంగా లారీ గుద్దడంతో జనాలు గాల్లోకి ఎగిరిపడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు.లారీ క్యాబిన్ కింద ఓ బైక్ చిక్కుకోవడంతో.. పెట్రోల్ ట్యాంక్ పగిలి మంటలు చెలరేగాయి. దీంతో లారీ దగ్ధమయింది. అయితే అనుకోని ఈ ఘటనతో ఆవేశం ఆపుకోలేక అక్కడు ఉన్న ప్రజలే లారీని తగులబెట్టినట్లు భావిస్తున్నారు.లారీ డ్రైవర్ని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
…………………………………………….