
* మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిపై కవిత హాట్ కామెంట్స్
ఆకేరున్యూస్,హైదరాబాద్ ః ఎమ్మెల్సీ కవిత మరోసారి హాట్ హాట్ కామెంట్స్ చేశారు. ఆమె చేసిన కామెంట్స్ ను పరిశీలిస్తే సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి( MLA JADEESH REDDY)ని ఇటీవల కవితపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చినట్లుగా అర్థం అవుతోంది. ఇటీవల జగదీశ్ రెడ్డి ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ కవిత పార్టీలో ఉంటేనే ఎమ్మెల్సీ బయటకు పోతే ఏమీ లేదు అని వ్యాఖ్యానించారు.అయితే జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వెనుకు బీఆర్ ఎస్ నేత ఉన్నారని కవిత ( MLC KAVITHA) సంచలన వ్యాఖ్య చేశారు. ఆ బీఆర్ ఎస్ నేత ఎవరనేదే ప్రశ్న.పార్టీలో ఆయనో లిల్లిపుట్ అంటూ ఘాటుగా విమర్శించారు. జగదీశ్ రెడ్డి పూర్తిగా దిగజారి పోయి మాట్లాడుతున్నారని కవిత విమర్శించారు. నల్గొండ జిల్లాలో బీఆర్ ఎస్ ను నాశనం చేసిందే జగదీశ్ రెడ్డి అని ఆమె ధ్వజమెత్తారు. తన మీద ఇలా మాట్లాడడం సరికాదని అన్నారు. జగదీశ్ రెడ్డి సీనియర్ నాయకుడు అని ఆయన ఇలా మాట్లాడుతారు అని అనుకోలేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.
అనుమతి ఇవ్వక పోతే ఇంటి వద్దే దీక్ష..
రేపటినుంచి బీసీ రిజర్వేషన్ల ( BC RESERVATIONS BILL) పై చేపట్టనున్న మూడు రోజుల దీక్షకు ప్రభుత్వం,కోర్టులు అనుమతించకుంటే ఇంటి వద్దే దీక్ష కొనసాగిస్తానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( MLC KAVITHA) హెచ్చరించారు..ఆదివారం ఆమె మీడియాతోమాట్లాడుతూ తాను చేపట్టనున్న దీక్షకు ప్రభుత్వం అనుమతినివ్వాలని కోరారు. ఈ మూడు రోజులు బీసీఘాల నాయకులు తమ అభిప్రాయాలను తెలియజేయాలని కోరారు. బీసీల్లో దాదాపు 112 కులాలు ఉన్నాయని రోజుకు 40 మంది కుల సంఘాల నాయకులు మాట్లాడినా అందరి అభిప్రాయాలను తెలుసుకునే అవకాశం లభిస్తుందన్నారు.గాంధేయ మార్గంలోఅన్న పానీయాలు లేకుండా 72 గంటలు దీక్ష కొనసాగిస్తాననికవిత స్పష్టం చేశారు.బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్( CONGRESS) బీజేపీ(BJP) పార్టీలు నాటకం ఆడుతున్నాయని కవిత అన్నారు.బిసి బిల్లుపై ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నరని కవిత విమర్శించారు.ఆర్డినెన్స్‌పై బీజీపీ నిర్ణయం ఏంటో స్పష్టం చేయాలని కవిత కోరారు.
………………………………………………