* ప్రజలు తీర్పు ఇచ్చేవరకూ ఆ సీట్లో కూర్చోను
* ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటన
ఆకేరు న్యూస్ డెస్క్ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Aravind Kejriwal) సంచలన ప్రకటన చేశారు. రెండు రోజుల్లో తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. మళ్లీ ప్రజల వద్దకు వెళ్లి తీర్పును కోరతానన్నారు. 2025 ఫిబ్రవరి లో ఎన్నికలు జరగాల్సి ఉండగా, తాజాగా కేజ్రీ ప్రకటన ఆసక్తి రేపుతోంది. తాను అవినీతి చేయలేదని భావిస్తేనే ప్రజలు తనకు ఓటేయాలని పిలుపునిచ్చారు. మళ్లీ గెలిస్తేనే సీఎం పదవిని చేపడతా అని కేజ్రీవాల్ ప్రకటించారు. ఆప్ నాయకులు సత్యేందర్ జైన్, అమానతుల్లా ఖాన్ ఇంకా జైల్లోనే ఉన్నారని.. భగవంతుడు ఇచ్చిన ధైర్యంతో శత్రువులతో పోరాడతామన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ(Delhi liquor polocy)కి సంబంధించిన సీబీఐ కేసులో కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
————————–