* అకస్మాత్తుగా అగ్నిప్రమాదం
* ప్రమాద సమయంలో బోటులో 8 మంది సిబ్బంది
ఆకేరు న్యూస్, విశాఖపట్టణం : నడిసముద్రంలో ఉండగా ఓ బోటు మంటల్లో చిక్కుకుంది. బోటులో ఉన్న సిబ్బందిని వేరే బోటులోని వారు రక్షించే ప్రయత్మం చేస్తున్నారు. విశాఖపట్టణం ఫిషింగ్ హార్బర్(Visakhapatnam Fishing Harbor)నుంచి ఆదివారం ఉదయం చేపల వేటకు వెళ్లిన బోటులో అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం సంభవించింది. నడిసముద్రం(Sea)లోఉండగానే భారీస్థాయిలో మంటలు(Fire) చెలరేగాయి. ప్రమాద సమయంలో బోటులో 8 మంది సిబ్బంది ఉన్నారు. సమీపంలోని బోటు సిబ్బందికి సమాచారం అందడంతో వారు, సిబ్బందిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. బోటు పూర్తిగా మంటల్లో చిక్కుకోవడంతో దాన్ని తీసుకొచ్చేందుకు అవకాశం లేనట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
—————————-
Please tell us what is wrong. Your report will be sent to the website team.
