హార్ట్ అటాక్ .. వంశపారంపర్యంగా వస్తుందా..! ?
ఆకేరు న్యూస్ , వరంగల్ :
ఒకప్పుడు గుండెపోటు ( Heart attack ) అంటే 70 ఏళ్లు దాటిన తర్వాత వచ్చే జబ్బుగా భావిచే వారు. అదీ క్రమంగా మారిపోతోంది. 50, 40, 30 సంవత్సరాల నుంచి క్రమంగా వయసు తగ్గిపోతోంది.
ఏకంగా 15 సంవత్సరాల వయసున్న పిల్లలకు కూడా గుండెపోటు (teenage Heart attacks ) వస్తోంది. టీనేజ్ పిల్లలు ఈ మద్య ఎక్కవగా గుండెపోటు తో మృత్యువాత పడుతున్నారు. పదవ తరగతి, ఇంటర్ మీడియట్ చదివే పిల్లలు కూడా గుండెపోటుకు గురవుతున్నారు. ఎందుకిలా జరుగుతోంది. ఆహారపు అలవాట్లు, కనీస వ్యాయామం లేకపోవడమా .. ఇతర జన్యుపరమైన కారణాలేమైనా ఉన్నాయా అన్న విషయం తేలాల్సి ఉంది. గుండెపోటు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుందా .. అంటే తప్పని సరిగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే .. వంశపారంపర్యంగా గుండె జబ్బులు ఉన్నవాళ్ళు మాత్రం తప్పనిసరిగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..?
గుండె జబ్బులు రాకుండా అందరూ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా తాత , తండ్రి , తల్లి కి గుండె జబ్బులకు గురయిన మెడికల్ హిస్టరీ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని వరంగల్‌కు చెందిన ప్రముఖ గుండె వ్యాధి నిపుణులు డాక్టర్ మల్లి కార్జున్ రావు చెబుతున్నారు.. 20 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత సంవత్సరానికి ఒకసారి కొలెస్ట్రాల్ టెస్ట్.. దాన్నే లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ అని కూడా అంటాం. ఇతర టెస్టులు తప్పనిసరి చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది.. ఈ టెస్టుల ద్వారా కొలెస్ట్రాల్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, షుగర్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, పేషంట్ యాక్టివిటీ ఏ విధంగా ఉంది. దీంతోపాటు ప్రతి రోజు వ్యాయామం చేయాలి. డైట్ పాటించాల్సి ఉంటుంది.
* వేపుడు కూరలకు దూరంగా ఉండాలి.
షుగర్, బిపి ఉన్న వాళ్ళు , సిగరెట్ తాగే అలవాటు ఉన్నవాళ్లు , ఆయిల్ మరియు ఉప్పును తక్కువ మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు ఫ్రై చేసిన కూరలను తినకపోవడం మంచిది. ఉడికించిన కూరలను డైట్ లో చేర్చుకోవడం , ప్రతిరోజు ఫ్రూట్స్ ని ఎక్కువ మోతాదులో తీసుకోవడం, పిజ్జా బర్గర్ లాంటి జంక్ ఫుడ్ ని తగ్గించుకోవడం సిగరెట్ మందు మానేయడం లాంటివి చేయాలి. దీని వల్ల బీపి నియంత్రణలో ఉంటుందని డాక్టర్ మల్లికార్జున్ చెప్తున్నారు.
* సిగరెట్ తాగక పోయినా తాగినట్లే లెక్క..
సిగరెట్ తాగే అలవాటు లేకపోయినప్పటికీ సిగరెట్ తాగే వాళ్ళకి ఒక మీటర్ దూరం లో కూర్చున్నా కూడా తాగినట్లే అవుతుంది. సిగిరెట్ తాగే వ్యక్తికి ఎంత రిస్క్ అయితే ఉంటుందో పక్కన కూర్చున్న వ్యక్తికి కూడా అంతే రిస్క్ ఉంటుందని డాక్టర్మల్లికార్జున్ గారు చెబుతున్నారు..
సిగిరెట్ మందు మాననిపక్షంలో డిహైడ్రేషన్ కి వెళ్లడం షుగర్ కంట్రోల్లో ఉండకపోవడం గుండెపోటు వచ్చే రిస్క్ ను తగ్గించుకోవాలంటే డైట్ మరియు ఎక్ససైజ్ తో పాటు మధ్యలో హెల్త్ చెకప్ చేయించుకుంటూ ఉండాలి. ఈ మధ్యకాలంలో కొన్ని రకాల రక్త పరీక్షలు కూడా అందుబాటులోకి వచ్చాయి అవి రెగ్యులర్ కొలెస్ట్రాల్ టెస్టులే కాకుండా HsCRP తో పాటు కొన్ని రకాల బేస్ లైన్ టెస్టులు చేయించుకోవాలి. అవి ఈసీజీ, ట్రెడ్మిల్ టెస్ట్ చెయ్యడం వలన ఫ్యూచర్ రిస్క్ ను కూడా ముందే గమనించే అవకాశం ఉంటుంది. దీనికి అనుగుణంగా ట్రీట్మెంట్ తీసుకుంటే సులభంగా ఉంటుందని డాక్టర్ మల్లికార్జున్ చెబుతున్నారు.
———————–