* హైదరాబాద్ లో ఓ ఉపాధ్యాయురాలి మృతి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : నిప్పులకొలిమిలా వాతావరణం సెగలు గక్కుతోంది. ప్రజలు విలవిలలాడుతున్నారు. ఇంట్లో ఉన్నా ఉక్కబోతే. పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలకు మించి గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ మేరకు తెలుగురాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తీవ్ర వడగాలులు వీస్తున్నాయని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆదిలాబాద్ జిల్లాలోని 10 మండలాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మరో మూడు రోజుల పాటు తీవ్ర వడగాలులు ఉంటాయని వివరించారు. వృద్ధులు, పిల్లలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా, వడదెబ్బకు హైదరాబాద్ లో ఓ ఉపాధ్యాయురాలు మృతి చెందారు. తాండూరు వికారాబాద్ కు చెందిన ఆమె ఆర్టీసీ బస్సు ఎక్కుతుండగా స్పహ తప్పి పడిపోయారు. వైద్యులు పరీక్షించగా మృతిచెందినట్లు ధ్రవీకరించారు.
———————