* వాతావరణ శాఖ హెచ్చరికలు
* నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్
* అప్రమత్తమైన ప్రభుత్వం
* విద్యాసంస్థలకు సెలవు ప్రకటన
ఆకేరు న్యూస్, విశాఖపట్టణం: ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో వాయుగుండం బలపడుతుందని, తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. రేపు సాయంత్రం తీరం దాటుతుందని పేర్కొంది. ఈ మేరకు విశాఖపట్టణం (VISAKHAPATNAM), విజయనగరం(VIJAYANAGARAM), తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. 184 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఎక్కడికక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్లు (COMAND CONTROL CENTER) ఏర్పాటు చేస్తోంది. తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురిసే అవకాశం ఉండడంతో జీవీఎంసీ(GVMC) అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు ఖాళీ చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అవసరమైతే తప్ప బయకు రావద్దని కోరింది. విజయనగరం జిల్లాలో ఇప్పటికే వర్షాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ విజయనగర జిల్లా కలెక్టర్ ప్రకటించారు. మిగిలిన మూడు జిల్లాల్లో కూడా సెలవులు ప్రకటించాలన్న డిమాండ్ వస్తోంది.
——————————–