
* యాకన్నగూడెం వద్ద కొట్టుకుపోయిన తాత్కాలిక మట్టి రోడ్డు
* పొలాల్లోకి భారీగా చేరిన వరద నీరు
* వెంకటాపురం మండలంలోని చొక్కాల గ్రామం జలమయం
ఆకేరు న్యూస్, వాజేడు వెంకటాపురం : తూర్పు, పశ్చిమ ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. ములుగు జిల్లా వాజేడు వెంకటాపురం మండలంలో బుధవారం భారీ వర్షంకురుస్తున్నది. ఈ వర్షంతో చెరువులు, కుంటలు మొత్తం నిండాయి. పలు రహదారుల్లో నీరు వచ్చి చేరింది. యాకన్నగూడెం వద్ధ తాత్కాలికంగా నిర్మించిన మట్టి రోడ్డు వరద దాటికి పూర్తిగా కొట్టుకుపోయింది. రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కంకల వాగు, బల్లకట్టు వాగు పొంగిపొర్లుతున్నాయి. పంట పొలాల్లోకి భారీగా వరద నీరు చేరుతుంది. పలు గ్రామాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరుతున్నది. ఎదుట చెరువు మత్తడి పోస్తున్నది పాలెంవాగు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతుంది. తెలంగాణ నయాగరా బోగత జలపాతానికి భారీగా వరద నీరు చేరుతుండడంతో పొంగిపొర్లుతున్నది. వెంకటాపురం మండలంలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. మండలంలోని చొక్కాల గ్రామాన్ని వరద నీరు ముంచెత్తడంతో జలమయంగా మారింది.
……………………………………..