* నేడు ఈ జిల్లాల్లో వర్షం
ఆకేరు న్యూస్, హైదరాబాద్: ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వ చ్చే వారం రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ (Hyderabad) వాతావారణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ నెల 25న తూర్పు, మధ్య బంగాళాఖాతం సమీపంలోని ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. దీని ప్రభావంతో 26న వాయుగుండంగా మారి 27న తీరాన్ని దాటే అవకాశాలున్నట్టు తెలిపింది. దీని ప్రభావంతో 27వరకు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy Rains_ కురుస్తాయని వెల్లడించింది. అలాగే నేడు నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి(Rangareddy), వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. హైదరాబాద్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పొడి వాతావరణం ఉంటుందని, ఆ తర్వాత ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని వివరించింది. మిగిలిన అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
…………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
