* ఎనుమాముల మార్కెట్ లో తడిసిన పత్తి, మొక్కజొన్న
ఆకేరు న్యూస్, వరంగల్: వరంగల్ జిల్లాలో ఉన్నట్లుండి వాతావరణం మారింది. మంగళవారం ఉదయం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. సుమారు అరగంట పాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి మళ్లీ రోడ్లన్నీ జలమయమయ్యాయి. రహదారులపై నీరు నిలిచిపోయింది. మొంథా తుఫాన్ కారణంగా కురిసిన వర్షాలకు నగరం అతలాకుతలం అయిన విషయం తెల్సిందే. నగరంలోని 150 కాలనీలు జలమయం అయ్యాయి. కాలనీ వాసులు సర్వం కోల్పోయి అవస్థలు పడ్డారు. మొన్నటి వరదల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న నగర ప్రజలకు మంగళం వారం అకస్మాత్తుగా వర్షం కురియడంతో భయాందళనలు వ్యక్తం చేశారు. కాగా ఎనుమాముల మార్కెట్ లో ఆరబోసిన పత్తి, మొక్కజొన్న నిల్వలుతడిసిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
………………………………………………
