* వేలేరులో హిడ్మా ఫ్లెక్సీ
* కేసు నమోదు చేసిన పోలీసులు
ఆకేరు న్యూస్, హనుమకొండ : వేలేరులో హిడ్మా ఫ్లెక్సీ వెలిసింది. ఇదీకాస్తా.. హనుమకొండ జిల్లాలో కలకలం రేపింది. ఈ ఫ్లెక్సీని బుచ్చయ్య, సురేష్ ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఓ వీరుడా నీవు కన్న కల దోపిడీ లేని స్వేచ్ఛా దేశం.. నీ సింధూరం పీడత ప్రజలకు కొత్త పొద్దు.. ప్రజల గుండెల్లో నీ చరిత్ర సజీవం..పీడిత జనానికి స్వేచ్ఛ పోరాటానికి నీవునిత్యం రణభేరి నినాదం.. జనతా సర్కార్ ఆశయం చిరస్థాయి వీరుడా హిడ్మా.. అని ఫ్లెక్సీలో రాసి ఉంది. దీంతో ఫ్లెక్సీని ఏర్పాటు చేసిన వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మావోయిస్టులపై సానుభూతి తెలిపితే కఠిన చర్యలుంటాయని పోలీసులు హెచ్చరించారు. మారేడుపల్లిలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా, అతని భార్య మృతి చెందిన విషయం తెలిసిందే. హిడ్మాదీ బూటకపు ఎన్కౌంటరే అని ప్రజా సంఘాల నాయకులు తెలిపారు.

