* 21 నుంచి యధావిధిగా పరీక్షలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : గ్రూపు 1 మెయిన్స్(Group – 1 Mains) పరీక్షల నిర్వహణకు తెలంగాణ హైకోర్టు( High Court) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. గతంలో నిర్వహించిన గ్రూప్-1 పరీక్షల్లో 7 ప్రశ్నలు తప్పుగా వచ్చాయని, తమకు అన్యాయం జరుగుతుందని పదికి పైగా పరీక్షలు రాసిన అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. తాజాగా మంగళవారం తుది తీర్పును వెలువరించింది. గ్రూప్-1 మెయిన్స్‌కు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్(Green Signal) ఇచ్చింది. గ్రూప్-1 ప్రిలిమ్స్‌పై దాఖలైన పిటిషన్లను డిస్మిస్ చేసింది. దీంతో ఈనెల 21న జరగాల్సిన మెయిన్ పరీక్షలు యథావిధిగా కొనసాగనున్నాయి.
………………………..