* వర్చువల్‌గా హాజరైన హైడ్రా కమిషనర్ రంగనాథ్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైడ్రా కూల్చివేతలపై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోర్టుకు వర్చువల్‌గా హాజరయ్యారు. కాగా, హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై ఇటీవల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవలే అమీన్పూర్లో ఓ భవనాన్ని హైడ్రా కూల్చివేయగా.. కోర్టులో పెండిరగ్లో ఉన్న భవనాన్ని ఎలా కూలుస్తారని కోర్టు ప్రశ్నించింది. దీనిపై వ్యక్తిగతంగా లేదా వర్చువల్‌గా కోర్టుకు సమాధానం చెప్పాలని సీరియస్ కాగా.. ఈ నేపథ్యంలో రంగనాథ్ వర్చువల్‌గా కోర్టుకు హాజరయ్యారు. ఆయనతో పాటు అమీన్పూర్ తహసీల్దార్ కూడా హజరై కోర్టుకు వివరణ ఇచ్చారు.
……………………………..