* ప్రతీ సినిమాకు ధరలు పెంచుకుంటూ పోతున్నారు
* హైకోర్టు సింగిల్ బెంచ్ ఆగ్రహం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : అఖండ 2 ప్రీమియర్ షోతో పాటు, టికెట్ల ధరను పెంచుకోవచ్చునని హోం శాఖ ఈ నెల 10న సర్య్కులర్ జారీ చేసింది. ధరల పెంపుపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. టికెట్ ధరల పెంపు ఉత్తర్వులను నిన్న హైకోర్టు రద్దు చేసింది. అయినప్పటికీ టికెట్ ధరలను యధావిధిగా పెంచి విక్రయాలు జరిపారు. దీనిపై పిటిషనర్లు మరోసారి కోర్టును ఆశ్రయించారు. బుక్ మై షోలో ఆన్లైన్లో ధరలను పెంచి విక్రయించినట్లు పిటిషనర్ల తరఫు న్యాయవాదులు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో టికెట్ ధరల పెంపుపై మరోసారి హైకోర్టు సింగిల్ బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతీ సినిమాకు ఇలా టికెట్ ధరలను పెంచుతూ పోతున్నారని పేర్కొంది. ధరలు పెంచాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. కోర్టు ఉత్తర్వులు కావాలని ఉల్లంఘిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులను సవాల్ చేయకుండానే తిరిగి సర్య్కులర్ జారీ చేస్తున్నారని అభిప్రాయపడింది. కోర్టు ధిక్కరణకు ఎందుకు పాల్పడుతున్నారని బుక్ మై షోతో పాటు, నిర్వాహకులను ప్రశ్నించింది.
……………………………………….

