
* ఎన్నికల్లో లబ్ది కోసమే కాంగ్రెస్, డీఎంకే డ్రామాలు
* త్రిభాషా విధానంపై రాజకీయాలు
* కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : గతంలో యూపీఏ హయాంలో కొత్త విద్యావిధానం తెచ్చినప్పుడు డీఏంకే వ్యతిరేకించలేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishanreddy) తెలిపారు. యూపీఏ నాటి విద్యా విధానంతో పోలిస్తే కొత్త విద్యా విధానం హిందీయేతర భాషలకు అనుకూలమన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. త్రిభాషా విధానం మోదీ హయాంలో వచ్చింది కాదన్నారు. సి.రాజగోపాల చారి ఆలోచన నుంచే త్రి భాష విధానం వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో కొఠారి కమిషన్ త్రిభాషా విధానాన్ని బలపరిచినట్లు వివరించారు. ఎన్నికల్లో లబ్ది కోసమే ఇప్పుడు కాంగ్రెస్(Congress), డీఎంకే (Dmk) అనవసర రాద్దాంతం చేస్తున్నాయని విమర్శించారు. ఆల్ పార్టీ మీటింగ్ కూడా స్టాలిన్ (Stalin) ఎన్నికల ఎత్తుగడ అన్నారు. ఆయన ప్రతీది రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. మోదీ వచ్చాకే.. ప్రాంతీయ భాషల్లో ఉన్నత విద్య దిశగా అడుగులు పడ్డాయని తెలిపారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే 2020లో వచ్చిన విద్యా విధానంపై ఇప్పుడు రాద్దాంతం చేస్తున్నారని విమర్శించారు. రూపాయి లోగోను డీఎంకే ప్రభుత్వం మార్చిందని తెలిపారు. మోదీ అధికారంలోకి వచ్చాక హిందీని ఎవరిపైనా బలవంతంగా రుద్ద లేదని చెప్పారు.
………………………………