
* ఐఎస్ఎస్ తో విజయవంతంగా అనుసంధానమైన స్పేస్ ఎక్స్ 10
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సునీతా విలియమ్స్(Sunitha Viliams), బుచ్ విల్మోర్ భూమ్మీదకు వచ్చేందుకు మార్గం సుగమమైంది. నిన్న నలుగురు వ్యోమగాములతో ఐఎస్ ఎస్ కు వెళ్లిన నాసా, స్పేస్ ఎక్స్ క్రూ-10. ఐఎస్ ఎస్తో విజయవంతంగా అనుసంధానమైన స్పేస్ ఎక్స్ 10 వ్యోమ నౌక. ఐఎస్ఎస్(Iss)లో సునీత, విల్మోర్ ను నలుగురు వ్యోమగాములు కలిశారు. సునీత, విల్మోర్ స్థానంలో విధుల నిర్వర్తనకు ఆ నలుగురూ వెళ్లారు. వచ్చే వారం స్పేస్ ఎక్స్ క్యాప్యూల్స్ లో సునీత, విల్మోర్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సునీత, విల్మోర్ తొమ్మిది నెలలుగా ఐఎస్ ఎస్‌లోనే చిక్కుకుపోయారు. సునీత, విల్మోర్ ను తీసుకొచ్చేందుకు నాసా, స్పేస్ ఎక్స్ క్రూ10 ప్రయోగం ప్రారంభించింది. డాకింగ్, హ్యాచ్ ఓపెనింగ్ ప్రక్రియ విజయవంతం అయినట్లు నాసా తెలిపింది. డ్రాగన్ క్యాప్సూల్(Dragon Capsuls)లో ప్రయాణించి అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించిన వ్యోమగాములకు.. సునీతా విలియమ్స్ బృందం స్వాగతం పలికింది.. ప్రస్తుతం ISSలో మొత్తం 11 మంది వ్యోమగాములు ఉన్నారు.. హ్యాండోవర్ ప్రక్రియ రెండురోజుల పాటు సాగనున్నట్లు నాసా తెలిపింది. హ్యాండోవర్ ప్రక్రియ తర్వాత భూమికి సునీతా, విల్మోర్ రానున్నారు.
ప్రపంచం ఎదురుచూపులు
2024 జూన్ లో సునీత, బుచ్ 8 రోజుల మిషన్ లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లారు. కానీ బోయింగ్ స్టార్‌లైనర్ అంతరిక్ష నౌకలో ప్రయాణించారు.. అయితే.. ఆరుగురితో కూడిన సునీత బృందం తిరిగి వస్తున్నప్పుడు, స్టార్‌లైనర్ అంతరిక్ష నౌక థ్రస్టర్‌లో సాంకేతిక లోపం ఏర్పడింది. అప్పటి నుండి, ఇద్దరూ అంతరిక్షంలో చిక్కుకుపోయారు. దాదాపు 9 నెలలు అయ్యింది. అయితే.. సునీతా విలియమ్స్ – బుచ్ విల్మోర్ ను తిరిగి భూమి మీదకు తీసుకురావడానికి NASA-SpaceX శుక్రవారం క్రూ-10 మిషన్‌ను ప్రారంభించింది. ఈ మిషన్‌ను ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ప్రయోగించారు. ముందుగా ఈ మిషన్ బుధవారం ప్రారంభించారు.. కానీ వ్యవస్థలో కొంత సమస్య కారణంగా దాని ప్రయోగాన్ని నిలిపివేయాల్సి వచ్చింది. శుక్రవారం దీనిని విజయవంతంగా ప్రయోగించారు. సునీత-బుచ్ (Sunitha-Buch)భూమికి తిరిగి రావడం కోసం ప్రపంచం ఎదురు చూస్తోంది.
………………………………..