* ప్రయాణికులు సురక్షితం
* గాల్లో 141 మంది ప్రయాణికుల ప్రాణాలు
* మూడు గంటలుగా గాల్లో విమానం
* హైడ్రాలిక్ లోపంతో పనిచేయని వీల్స్
* తిరుచ్చి వివమానాశ్రయంలో మోహరించిన ఫైరింజన్లు, అంబులెన్స్‌లు
ఆకేరు న్యూస్ , డెస్క్: గాల్లో 141 మంది ప్రయాణికుల ప్రాణాలు ఉన్నాయి. షార్జా వెళ్ళాల్సిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. తిరుచ్చి విమానాశ్రయం నుంచి సాయంత్రం గం. 5.40 నిమిషాలకు టేకాఫ్ అయింది. టేకాఫ్ అయిన తర్వాత హైడ్రాలిక్ సమస్య తలెత్తినట్లు పైలట్ గుర్తించారు. దీంతో తిరుచ్చి విమానాశ్రయంలోని ఏటీఎస్ అధికారులకు సమాచారం తెలియ జేశారు. విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. అప్రమత్తమైన అధికారులు హుటాహుటిన విమానాశ్రయానికి 20 ఫైరింజన్లు, 20 అంబులెన్స్‌లు, వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచారు.
హమ్మయ్యా .. సేఫ్ ల్యాండ్..
తిరుచ్చి నుంచి షార్జా వెళ్ళాల్సిన ఎయిర్ ఇండియా విమానం (ఎక్స్ బీ, 613 ) లో 141 మంది ప్రయాణికులు ఉన్నారు. దాదాపు మూడు గంటలు ఆకాశంలో చక్కర్లు కొట్టింది. విమానంలో ఇంధనం అయిపోయేందుకు గంటల కొద్దీగా గాల్లో పైలట్ తిప్పారు. అనంతరం ఏటీఎస్ సూచనలతో పైలట్ సేఫ్ గా విమానాన్ని ల్యాండ్ చేశారు. ప్రయాణికులు, వారి కుటుంబ సభ్యులు, అధికార యంత్రాంగం కూడా ఒక్క సారిగా ఊపిరి పీల్చుకున్నారు.
…………………………………