
* తండ్రి సహాయంతో భర్తను హత్య
* వికారాబాద్ జిల్లాలో దారుణం
ఆకేరున్యూస్ వికారాబాద్ ః వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మల్కాపూర్ లో దారుణం చోటు చేసుకుంది. తాండూరు రూరల్ సీఐ నగేష్ తెలిపిన వివరాల ప్రకారం నాపరాయి గనుల్లో కార్మికుడిగా పనిచేస్తున్న రెడ్డిపల్లి వెంకటేష్ (32) కు పదేళ్ల కిందట కొత్లాపూర్ కు చెందిన జయశ్రీతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు కాగా మూడేళ్ల కిందట భార్యభర్తల మధ్య గొడవలు జరిగి జయశ్రీ పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లింది. ఇటీవలే గ్రామపెద్దలు ఇద్దరి మధ్య రాజీ కుదిర్చిజయశ్రీని తాండూరుకు తీసుకొచ్చారు. ఈ నేపధ్యంలోమళ్లీ ఇద్దరి మధ్య గొడవలు పునరావృతమైనట్లు గ్రామస్తులు తెలిపారు. అయితే ఆదివారం అర్ధరాత్రి దాటాక జయశ్రీ భర్త వెంకటేష్ చేతులు గట్టిగా పట్టుకోగా జయశ్రీ తండ్రి వెంకటేష్ గొంతునులిమి హత్య చేశాడు. తెల్లవారి ఏ మీ తెలియనట్లుగా వెంకటేష్‌ను ఆటోలో ఆస్పత్రికి తరలిస్తున్నట్లుగా తండ్రీ కూతుళ్లు నాటకమాడగా ఆటో డ్రైవర్ కు అనుమానం వచ్చి వెంకటేష్ చనిపోయాడని గుర్తించి మృతదేహాన్నితాను తీసుకుపోను అని నిరాకరించడంతో పక్కింట్లో ఉండే వెంకటేష్ తల్లి ,సోదరులు అక్కడికి చేరుకోవడంతో అసలు విషయం బయటపడింది. వెంకటేష్ సోదరులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వెంకటేష్ తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. వెంకటేష్ భార్య జయశ్రీని ఆమె తండ్రి పండరిలను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు.
………………………………………………