
* కీలక పోస్టులను భర్తీ చేస్తాం : పొన్నం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : త్వరలోనే ఆర్టీసీలో 3,038 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ (PONNAM PRABHAKAR) ప్రకటించారు. 2 వేల డ్రైవర్ పోస్టులు, 743 శ్రామిక్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. 84 డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్), 114 డిప్యూటీ సూపరింటెండెంట్ (మెకానికల్), 25 డిపో మేనేజర్/అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్, 18 మెకానికల్ ఇంజనీర్, 23 అసిస్టెంట్ ఇంజనీర్(సివిల్), 11 సెక్షన్ ఆఫీసర్, 6 అకౌంట్ ఆఫీసర్, 7 మెడికల్ ఆఫీసర్ జనరల్, 7 మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ పోస్టులను కూడా భర్తీ చేస్తామన్నారు. త్వరలోనే ఖాళీలను నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తామన్నారు.
……………………………………………..