* విరిగిపడ్డ కొండ చరియలు.. ముగ్గురి మృతి
ఆకేరు న్యూస్, డెస్క్ : జమ్ము కశ్మీర్లో వరుణుడు బీభత్సం సృష్టించాడు. కుండపోత వర్షంతో రాంబన్ జిల్లాలో కొండ చరియలు విరిగిపడ్డాయి. దాదాపు 40 ఇళ్లు ధ్వంసమయ్యాయి. రహదారులపై కొండ చరియలు విరిగిపడడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పలు ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి. వరదల్లో చిక్కుకుని ముగ్గురు మరణించారు. రెండు రోజుల నుంచి ఎడతెరపిలేకుండా కురుస్తున్న కుండపోత వానల కారణంగా భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. పలు ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి. వరదల కారణంగా చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. పశ్చిమాసియాలోని ప్రత్యేకమైన వాతవరణ పరిస్థితుల వల్లే జమ్మూలో భారీ వర్షాలు, తుఫాను సంభవించిందని వాతావరణ శాఖ తెలిపింది. దీనిపై జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. వరదల్లో చిక్కుకున్న 100 మందిని రెస్క్యూ బృందాలు రక్షించాయి.
…………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
