* పోలీసులు, నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు
* కాల్పుల్లో మరణించిన నక్సలైట్లు..?
ఆకేరున్యూస్, ఛత్తీస్గఢ్: ఛత్తీస్గఢ్ కంకేర్, నారాయణపూర్ జిల్లాల సరిహద్దులోని మాద్ ప్రాంతంలో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్ను ఛత్తీస్గఢ్ పోలీసులు ధృవీకరించారు. ఈ ఎన్కౌంటర్లో చాలా మంది నక్సలైట్లు మరణించినట్లు సమాచారం.. ఘటనా స్థలం నుంచి పోలీసులు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారని సమాచారం. ప్రస్తుతం ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
………………………………….