* 12 మంది మావోయిస్టుల మృతి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : చత్తీస్ గడ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో శనివారం ఉదయం జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో 12 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. భద్రతా దళాలకు మావోయిస్టులకు
మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోలు మృతి చెందినట్లు సమాచారం..ఈ ఘటనలో కుంటా ఏరియా కమిటీకి చెందిన సచిన్ మంగ్డు మరణించినట్టు సమాచారం. ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో మావోయిస్టులకు చెందిన ఆయుధాలను భారీ ఎత్తున భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఇరు పక్షాల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం.ఛత్తీస్గఢ్లో గతేడాది వివిధ ఎన్కౌంటర్లలో 285 మంది నక్సల్స్ మృతి చెందారు. బస్తర్ డివిజన్ (ఏడు జిల్లాలు) 257 మంది మృతి చెందగా మిగతా 27 మంది రాయ్పూర్ డివిజన్లో జరిగిన ఎన్కౌంటర్లలో కన్నుమూశారు. ఇక తాజా ఎన్కౌంటర్కు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
………………………………………………………………..

