raj kumar Shabad Murder Accused Suicide
* షాబాద్ ఆరుగురి హంతకుడు రాజ్‌కుమార్ ఆత్మహత్య
ఆకేరు న్యూస్, రంగారెడ్డి: షాబాద్‌లో బాలిక సహా ఆరుగురిని ఘోరంగా హతమార్చిన నిందితుడు రాజ్‌కుమార్ మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పంజర్లలోని తన మేనమామ ఊరిలో అతడు శవమై కనిపించాడు. మృతదేహం పక్కన పాయిజన్ బాటిల్ లభించడంతో, పోలీసుల వేట నుంచి తప్పించుకోవడానికి అతడు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు స్పష్టమవుతోంది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
