
* మే 7 నుండి 31వ తేదీ వరకు పోటీలు
* ప్రీ ఈవెంట్ వేడుకల్లో మంత్రి జూపల్లి వెల్లడి
ఆకేరున్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ మిస్ వరల్డ్ 2025 పోటీలకు ఆతిథ్యమిచ్చేందుకు సిద్ధమవుతోంది. మే 7 నుండి 31వ తేదీ వరకు జరగనున్న ఈ అంతర్జాతీయ అందాల పోటీల్లో సుమారు 140 దేశాలకు చెందిన అందాల భామలు పాల్గొనబోతున్నారు. తెలంగాణను అంతర్జాతీయంగా గుర్తింపును తెచ్చే ఈ వేదిక, రాష్ట్ర పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయనుంది. ఈ పోటీల సందర్భంగా, మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే అందాల భామలు మే నెలలో తెలంగాణలోని పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించనున్నారు. తెలంగాణ సంస్కృతి, వారసత్వ సంపద, అభివృద్ధిని వీరు ప్రపంచానికి తెలియజేయనున్నారు. మిస్ వరల్డ్ పోటీలపై మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. మిస్ వరల్డ్ పోటీని హైదరాబాద్లో నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. ఈక్రమంలో బేగంపేట్ టూరిజం ప్లాజాలో గురువారం మిస్ వరల్డ్ పోటీలకు చెందిన ప్రీ ఈవెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణా రావు, టీ-జీటీడీసీ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి, టూరిజం సెక్రటరీ స్మితా సబర్వాల్, మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈఓ జూలియా మోర్లీ, 2024 ప్రపంచ సుందరి క్రిస్టినా పిజ్కోవా, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు విూడియాతో మాట్లాడారు. హైదరాబాద్లో జరిగే మిస్ వరల్డ్ పోటీలకు 140 దేశాల నుంచి అందాల భామలు వస్తారని తెలిపారు.
…………………………………