* గ్రామాభివృద్ధితో మండల-జిల్లా పురోగతి*
– కమలాపూర్ ఎంపీడీవో గుండె బాబు
ఆకేరు న్యూస్ కమలాపూర్:
వార్డ్ మెంబర్లు గ్రామపంచాయతీ అభివృద్ధితో మండల, జిల్లా ను అభివృద్ధి పదంలో నడిపించే విధంగా పాటు పడాలాని కమలాపూర్ ఎంపీడీవో గుండె బాబు అన్నారు. కమలాపూర్, శనిగరం రైతు వేదికలో మండలంలోని వార్డ్ మెంబర్లకు ఐదు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా కమలాపూర్‌లో ఎంపీడీవో మాట్లాడుతూ..వార్డ్ మెంబర్లందరూ మండలంలో జరిగే ఐదు రోజుల శిక్షణ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరై, పలు అంశాలను అవగాహన చేసుకోవాలని, గ్రామపంచాయతీల పనితీరు, గ్రామపంచాయతీకి గల అధికారాలు, వార్డ్ మెంబర్ల యొక్క పాత్ర, వార్డును అభివృద్ధి చేసుకోవడంలో సహకరిస్తూ గ్రామపంచాయతీ అభివృద్ధికి కూడా సహకరించాలని, పదవి కాలంలో తప్పనిసరిగా వారి గ్రామపంచాయతీని ఆదర్శ గ్రామపంచాయతీ గా తయారయ్యే విధంగా చేయటంలో నూటికి నూరు శాతం సహకరించాలని తెలిపారు. వార్డ్ మెంబర్లు శిక్షణ కార్యక్రమంలో సందేహాలను నివృత్తి చేసుకొవాలాని కోరారు. శిక్షకులుగా శ్రీనివాస్, రాజ్ కుమార్,శరత్, వెంకటేష్, శనిగరం రైతు వేదిక లో డి ఎల్ పి వో లు గంగా భవాని, రవి బాబు, మండల పంచాయతీ అధికారి చేతన్ రెడ్డి, టి వో టి లు రవీందర్, కె లక్ష్మణ్, తిరుపతి, రాజు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ గ్రామపంచాయతీల వార్డ్ మెంబర్లు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
