
* ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలి
* మంత్రి సీతక్క
ఆకేరు న్యూస్, ములుగు: ప్రస్తుతం జరగబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మంత్రి సీతక్క పిలుపునిచ్చారు .మండలంలోని శ్రీ సమ్మక్క సారలమ్మ వన దేవతలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తో దర్శించుకొని మొక్కులు చెల్లించిన అనంతరం జిల్లా అధ్యక్షుడు
పైడాకుల అశోక్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ బిజెపి పార్టీలు పని కట్టుకొని విమర్శలు చేస్తున్నారని, మన ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనివిధంగా అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజలకు చేదోడు వాదోడుగా నిలబడుతోందని అన్నారు.సన్న బియ్యం పథకం దేశానికే ఆదర్శమని అన్నారు. మహిళా ప్రగతి అంటేనే సమాజ ప్రగతి అన్న మహనీయుడు అంబేద్కర్ స్ఫూర్తితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని ప్రతి మహిళా సంఘానికి వడ్డీలేని రుణాన్ని ఇచ్చి.. ప్రతి మహిళను కోటీశ్వరులను చేయడం కోసం ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి వివరించారు. రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యకర్తలందరూ సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. ఆరు గ్యారెంటీలను అమలు చేసి ప్రజ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. రైతును రాజును చేయాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసిందన్నారు. నేను మంత్రి అయిన నాటి నుండి ఇప్పటి వరకు ములుగు నియోజక వర్గం లో సుమారు 30 కోట్ల సీడీఎఫ్ నిధులతో దళిత గిరిజన వాడల్లో సిసి రోడ్స్ డ్రైనేజీలు కల్వర్టు లు మంజూరు చెయ్యడం జరిగిందని అదే విధంగా ములుగు నూతన బస్ స్టాండ్ ఏటూరు నాగారం లో బస్ డిపో కు నిధులు 80 కోట్ల రూపాయలతో టూరిజం డెవలప్ మెంట్
పంచాయితీ రాజ్ శాఖ నుండి బిటి రోడ్లకు సుమారుగా 310 కోట్ల రూపాయలు కేటాయించి పనులు ప్రారంభించడం జరిగిందని ఇలా అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.నాయకులకు కార్యకర్తలకు మధ్యలో విభేదాలుంటే నా దృష్టికి తీసుకురావాలిని ఆమె కోరారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజల మధ్యలో ఉండాలి ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల మధ్యలోకి తీసుకెళ్లాలి మండల అధ్యక్షులు ముఖ్య నాయకులు కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి గ్రామాల్లో చిన్న చిన్న సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి కానీ ఎక్కడా మాట్లాడకూడదు పార్టీ కోసం పనిచేసిన వారిని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీట్ చేయడం కోసం అందరూ కలిసి సమన్వయంతో పని చేయాలి పార్టీ కోసం కష్టపడే వారికే స్థానిక సంస్థలలో టికెట్లు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ గారు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్ ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి తో పాటు మేడారం సమ్మక్క సారలమ్మ పూజారులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు యూత్ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
……………………………………………