
* ధర్మస్థలిలో దారుణం
* పోలీసుల ఎదుట వాంగ్మూలం ఇచ్చిన పారిశుధ్య కార్మికుడు
* సిట్ విచారణకు ఆదేశించిన కర్ణాటక ప్రభుత్వం
ఆకేరున్యూస్, డెస్క్ : నేత్రావతి నది సమీపంలో దుస్తులు లేని బాలికలు, దుస్తులు లేని మహిళల మృతదేహాలను నా చేతులతో పూడ్జిపెట్టాను..కొంత మంది స్కూల్ యూనిఫాంలో ఉన్న బాలికల మృత దేహాలను కూడా పూడ్జిపెట్టాను అని ఓ పారిశుద్య కార్మికుడు తనంతట తానే జూన్ 3న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కర్ణాటక పోలీసులే కాదు యావత్ భారత దేశం ఒక్క సారిగా ఉలిక్కి పడింది. దేశ విదేశాల నుంచి నిత్యం వేలాదిగా భక్తులు వచ్చే శ్రీక్షేత్ర మంజునాధ ఆలయంలో ఇన్ని ఘోరాలు జరిగాయా ..? దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ వార్త అసలు ఏం జరిగింది.. ఎలా జరిగిందో సిట్ విచారణ పూర్తయితే కాని తెలియదు. 1998 నుంచి 2014 వరకు శ్రీక్షేత్ర మంజునాధ అలయంలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేసిన ఓ వ్యక్తి ఇటీవల పోలీసుల ఎదుట ఈ నిజాలు బయట పెట్టాడు. దాదాపు వంద మంది మహిళలు మృతదేహాలను తానే నేత్రావతి నది ఒడ్డున పాతి పెట్టానని పోలీసులకు చెప్పాడు.
ప్రాణభయంతోనే..
అప్పట్లో ప్రాణభయంతోనే ఈ నిజాలు బయటపెట్టలేక పోయానని అతడు తెలిపాడు.. తాను ఈ విషయాన్ని బయటకు చెప్తే తనను కూడా చంపేస్తామని బెదిరించారని చెప్తున్నాడు. తాను పూడ్చి పెట్టిన మహిళల మృతదేహాలపై గాయాలు ఉండేవని వారు లైంగిక దాడి కి గురైనట్లుగా అన్పించేది అని తెలిపాడు. అందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు కూడా పోలీసులకు సమర్పించాడు. అయితే ఈ పారిశుధ్య కార్మికుడి వాంగ్మూలంపై అనేక ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
చనిపోయింది ఎవరు?
అయితే చనిపోయింది ఎవరు ? చనిపోయిన మృతదేహాలు ఎవరివి అనే ప్రశ్నలు వేధిస్తున్నాయి. గతంలో ఇంటి నుండి వెళ్లి పోయి అదృశ్య మైన మహిళలు చనిపోయిన వారిలో ఉన్నారా.. తమ అమ్మాయి కనబడకుండా పోయిందని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసిన ఆయా కుటుంబసభ్యలు ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాతిపెట్టిన మృతదేహాలను వెలికి తీసి డీఎన్ ఏ పరీక్షలు నిర్వహించాలనే డిమాండ్ వస్తోంది. 2003లో ఫ్రెండ్స్‌తో కలిసి ధర్మస్థలికి వెళ్లిన ఓ ఎంబీబీఎస్ విద్యార్థిని అనన్య భట్ తిరిగిరాలేదు. ఇప్పుడు ఆమె కుటుంబ సభ్యులు.. అనన్య కేసును కూడా విచారించాలని కోరుతున్నారు. ఇలాగే ఇంకొన్ని బాధిత కుటుంబాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ ఉదంతంపై ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు భగ్గుమంటున్నాయి. పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి . ఈ నేపధ్యంలో కర్ణాటక ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించింది.
సిట్ విచారణ
దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ ఉదంతంపై కర్ణాటక ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించింది. డీజీపీ ప్రణభ్ మొహంతీ నేతృత్వంలో ఐదుగురు ఐపీఎస్ అధికారులతో కూడిన బృందం దీనిపై విచారణ చేపట్టింది.చనిపోయిన వారు ఎవరు.. పారిశుధ్య కార్మికుడు ఇన్ని రోజుల తరువాత ఈ విషయాలను ఎందుకు వెల్లడించాడు. ఈ హత్యల వెనుక ఉన్న అదృశ్య శక్తులు ఎవరు అనే దానిమీద సిట్ అధికారులు విస్తృతంగా విచారణ చేస్తున్నారు.
………………………………………………..