
* అడ్లూరి నాకు అన్నలాంటి వాడు
* మీడియానే వక్రీకరించింది
* మిత్రుల మధ్య పంచాయతీ పెడుతున్నారు
* మంత్రి పొన్నం ప్రభాకర్
ఆకేరు న్యూస్ హైదరాబాద్: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తనకు అన్నలాంటి వాడని మంత్రి పొన్నం అన్నారు. మంగళవారం మంత్రి మీడియాతో మాట్టాడారు. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో తనకు ఎలాంటి విభేదాలు లేవని అన్నారు సోదరుల మధ్య పంచాయతీ పెడుతున్నారని పొన్నం ఆరోపించారు.తమ మధ్య విడదీయరాని బంధం ఉందన్నారు.ఈ బంధం గత 30 ఏళ్లుగా కొనసాగుతోందని అన్నారు. అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన వ్యక్తిగా, బీసీ వర్గానికి చెందిన నాయకుడిగా, తనకు ఎవరిపైనా అలాంటి అభిప్రాయం ఉండదన్నారు. అయితే, రాజకీయ దురుద్దేశంతో కొంతమంది తన వ్యాఖ్యలను వక్రీకరించి, వాస్తవానికి భిన్నంగా ప్రచారం చేశారని అన్నారు. దాంతో ఏర్పడిన అపార్థాల వల్ల అన్నలాంటివారు అయిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి మనసు నొచ్చుకుందని తెలిసి తనకు బాధ కలిగిందన్నారు. తాను రెండు రోజులు స్థానికంగా లేకపోవడం మూలంగా లక్ష్మణ్ కుమార్ కు ఫోన్ ద్వారా వాస్తవం తెలియచేయాలని ప్రయత్నించానని మంత్రి పొన్నం వివరణ ఇచ్చారు. మంచి మిత్రులమైన తమ మధ్య తగవు పెట్టి బిసి రిజర్వేషన్ల వ్యవహారాన్ని పక్క దారి పట్టించాలని ప్రయత్నిస్తున్నారని మంత్రి పొన్నం ఆరోపించారు. కానీ, వారి ఎత్తుగడలు చిత్తు చేస్తూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను బలోపేతం చేయడంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో సామాజిక న్యాయం సాధనలో, ప్రజల అభ్యున్నతికై తాముమ ఇద్దరం కలిసికట్టుగా కృషి చేస్తామని మంత్రి పొన్నం అన్నారు.
……………………………………..