* మంత్రి సీతక్క
ఆకేరు న్యూస్ ములుగు : వనతల్లుల గద్దెల నిర్మాణం ఆలయ అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యం అయినందుకు నా జీవితం ధన్యమైందని మంత్రి సీతక్క భావోధ్వేగంతో అన్నారు. మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి మేడారం ఆలయ పునర్మిణపనులను ప్రారంభించారు ఈ కారక్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొని మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యం కావడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. సమ్మక్క తల్లుల ఆశీర్వాదం వల్లే ఇంతటి దాన్ని అయ్యానని చెప్పుకొచ్చారు. తల్లులు బాగుంటే ప్రజలందరూ బాగుంటారని అందుకే ఆలయాన్ని శాశ్వతంగా నిర్మించాలనే ఆశయంతో సీఎం రేవంత్ రెడ్డి ఆలయ ప్రాంగణాన్ని శాశ్వతంగా నిర్మించేందుకు పూనుకున్నారని సీతక్క తెలిపారు.ఆలయ అభివృద్ధి పనుల్లో రాజీ పడే ప్రసక్తే లేదని ఎంత ఖర్చు అయినా సరే ఫరవాలేదు అని సీఎం హామీ ఇచ్చారని సీతక్క తెలిపారు. ఆదివాసీల సాంప్రదాయాల మేరకే గద్దెల నిర్మాణం ఇతర అభివృద్ధి పనులు జరుగుతాయని సీతక్క తెలిపారు. ములుగు నియోజకవర్గ ప్రజల తరపున ఆదివాసీల తరపున మంత్రి సీతక్క సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
……………………………………..
