* గుండెపోటుతో బస్ కండక్టర్ మృతి
అకేరు న్యూస్, హైదరాబాద్ : అప్పటి వరకు సహచరులతో ముచ్చటించాడు. వాష్ రూమ్ కి వెళ్ళొస్తా అన్నాడు. వెళ్తానే కుప్పకూలి పోయాడు. మియాపూర్ డిపోలో కండక్టర్ గా పనిచేస్తున్న పండరి మంగళవారం ఉదయం డ్యూటీ కి వచ్చిన సమయంలో వాష్ రూమ్ కు వెళ్లి అక్కడే కుప్పకూలి మృతి చెందాడు. హార్ట్ ఎటాక్ వల్లే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
డిపోలో విషాదం..
తమతో మాట్లాడి వాష్ రూమ్ కు వెళ్ళొస్తా అని చెప్పిన పండరి నిమిషాల్లోనే విగతజీవిగా మారడంతో తోటి ఉద్యోగులు షాక్ కు గురయ్యారు. యువకుడైన పండరి కళ్ళముందే మృత్యువాత పడటం చూసి సీనియర్ ఉద్యోగులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
……………………………………….
