* కర్ణాటక సీఎం సిద్దరామయ్య
* మైసూర్ లో కన్నడ సినిమా పురస్కారాల ప్రదానం
ఆకేరు న్యూస్, డెస్క్ : తాను సినిమాలు చూసే రోజుల్లో చూసిన సినిమాలనే మళ్లీ చూసేవాడిని అని కర్ణాటక సీఎం సిద్దరామయ్య అన్నారు. మైసూరులో సోమవారం ఆయన 1018-19లకు గాను ఎంపికైన సినిమాలకు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా సిద్దరామయ్య మాట్లాడుతూ గతంతో పోలిస్తే ఇప్పటి సినిమాల నిర్మాణం ఎక్కువైందన్నారు. అప్పట్లో సినిమాలు తక్కువగా రిలీజ్ అయ్యేవని అందుకే చూసిన సినిమాలనే మళ్లీ చూసే వాళ్లమని కాలేజీ రోజులను గుర్తు చేసుకున్నారు.సినిమాల్లో సామాజిక స్పృహ కొరవడిందని ఆవేదనవ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ ను గుర్తుచేసుకున్నారు. రాజ్ కుమార్ సినిమాల్లోనూ నిజజీవితంలోనూ నైతిక విలువలకు అధిక ప్రాధాన్యతనిచ్చేవారని కొనియాడారు. ఆయన అడుగుజాడల్లో సినిమా తారలు నడుచుకోవాలని కోరారు. సమాజానికి ఉపయోగ పడే సినిమాలు తీస్తూ నిజజీవితంలో కూడా సామాజిక కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలన్నారు. రాష్ట్రప్రభుత్వం తరపున సినిమాలకు అందించే పురస్కారాలు గత నాలుగైదు ఏళ్లుగా నిలిచిపోయాయని ఇక నుండి క్రమంత తప్పకుండా ప్రతీ ఏటా అవార్డులను ప్రకటిస్తామని తెలిపారు. సినిమా పరిశ్రమకు బకాయి పడ్డ సబ్సిడీని వెంటనే విడుదల చేస్తామన్నారు. మైసూరులో 160 ఎకరాల స్థలంలో ఫిలింసిటీ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. రెండు నెలల్లో నిర్మాణ పనులు ప్రారంభంమవుతాయని సీఎం సిద్దరామయ్య తెలిపారు.
…………………………………………..
