
* బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ తక్కళ్ల పల్లి రవీందర్ రావు
ఆకేరు న్యూస్ ,హనుమకొండ : ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు ( THAKKALLAPALLY RAVINDER RAO) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎప్పటికైనా ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టాలన్నదే తన లక్ష్యం అని రవీందర్ రావు అన్నారు.పార్టీ అధిష్టానం అదేశిస్తే పాలకుర్తి (PALAKURTHY) నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించారు. ఆకేరు ప్రతినిధి కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్య్వూలో ఆయన తన మనసులోని కోరికన బయట పెట్టారు.యతి రాజారావు (YATHI RAJARAO) శిష్యుడిగా పాలకుర్తి నుంచే తన రాజకీయ జీవితం మొదలైందని చెప్పుకొచ్చారు గ్రామపంచాయతీ అధ్యక్షుడిని అయింది అక్కడే.. మండల పార్టీ అధ్యక్షుడిని అయింది అక్కడేతెలుగుదేశంలో జిల్లా సెక్రటరీ అయింది అదే నియోజకవర్గంలో అని రవీందర్ పేర్కొన్నారు. 2009 నుంచి మూడు ఏళ్ల పాటు పాలకుర్తి నియోజకవర్గానికి ఇంచార్జిగా పనిచేశానని అన్నారు. 2014 లోనే అవకాశం వస్తుందని అనుకున్నాను కానీ అనుకోకుండా తన గురువుగారైన యతి రాజారావు కుమారుడు డాక్టర్ సుధాకర్ రావు( DR SUDHAKAR RAO) కి అవకాశం వచ్చిందని తెలిపారు. ఆ తరువాత ఎర్రబెల్లి దయాకర్ రావు (ERRABELLY DAYAKAR RAO) టీఆర్ ఎస్ లోకి రావడం తో తనకు దక్కాల్సిన పాలకుర్తి ఎమ్మెల్యే టికెట్ కేసీఆర్ ఎర్రబెల్లికి కేటాయించారని తెలిపారు. 2018 ఎన్నికలప్పుడే దయాకర్ రావు తాను చివరిసారిగా పోటీ చేస్తున్నానని ఇక రాజకీయాలనుండి తప్పుకుంటానని ప్రకటించారని రవీందర్ రావు గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో పాలకుర్తి టికెట్ తనకే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పాలకుర్తి కాకుండా కేసీఆర్ ఎక్కడినుంచి ఆదేశిస్తే అక్కడి నుంచి పోటీ చేస్తానని రవీందర్ రావు అన్నారు.
………………………………………..