
* పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి
* స్టేషన్ ఘన్పూర్ రిజర్వాయర్ నుంచి సాగునీటి విడుదల
ఆకేరు న్యూస్, పాలకుర్తి : పాలకుర్తి నియోజకవర్గంలో రైతులకు సాగునీటి కష్టాలు లేకుండా చేస్తాను అని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి అన్నారు. బుధవారం ఆమె స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి ఘన్పూర్ రిజర్వాయర్ నుంచి సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గంలోని రైతులకు సాగునీటి కష్టాలు లేకుండా చూడాలనే సంకల్పంతోనే నేను ప్రయత్నించాను. గతంలో ఇచ్చిన మాట మేరకు ఈ రోజు ఘనపూర్ రిజర్వాయర్ నుండి నీటిని విడుదల చేశాం. ఇది మా రైతుల పంటలకు జీవనాడిగా మారుతుంది అని అన్నారు. ఇప్పటికే వర్షాలు ఆలస్యంగా రావడంతో, ఖరీఫ్ సీజన్లో సాగు పనులు నిలకడగా సాగలేకపోతున్న నేపథ్యంలో ఈ నీటి విడుదల రైతులకు పెద్ద ఊరటను కలిగించింది. రిజర్వాయర్ నుండి నీటిని విడుదల చేయడం వల్ల పాలకుర్తి నియోజకవర్గంలోని పలు మండలాల్లోని పంట పొలాలకు తగిన నీటి సరఫరా అందనుంది..ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో సాగునీటి సమస్యపై ప్రత్యక్షంగా స్పందించి తక్షణమే స్పందించిన యశస్విని రెడ్డి గారిని, కడియం శ్రీహరి గారిని, రైతులు హర్షాతిరేకాలతో అభినందించారు.
……………………………..……………..