* శోభితా ధూలిపాళ్ల ఇంట్రెస్టింగ్ పోస్ట్
ఆకేరు న్యూస్ సినిమా డెస్క్ : అక్కినేని వారసుడు నాగచైతన్య(Nagachaitanya)తో ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న నటి శోభితా ధూళిపాళ్ల(Actress Sobhita Dhulipala) ట్విటర్ (ఎక్స్)లో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. ‘వీళ్లందరూ ఎవెంజర్స్ అని నా పిల్లలకు చెబుతాను’ అని అన్నారు. అసలు విషయం ఏంటంటే.. కల్కి కృష్ణమైర్తి రాసిన నవల ఆధారంగా మణిరత్నం(Maniratnam) దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్-1(Ponniyan Selvan-1) ఘన విజయాన్ని అందుకుంది. రెండు పార్టులుగా వచ్చిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లో మంచి వసూళ్లు రాబట్టింది. విక్రమ్, కార్తి, జయం రవి, త్రిష, ఐశ్వర్యారాయ్ బచ్చన్, శోభితా ధూళిపాళ్ల లాంటి భారీ స్టారింగ్ ఇందులో నటించారు. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ విడుదలై రెండేళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో నటి శోభితా ధూళిపాళ్ల ఆ సినిమా రోజులను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌తో దిగిన ఫొటోను షేర్ చేసింది. ఈ ఫొటోతో పాటు ఆసక్తికరమైన క్యాప్షన్‌ను రాసుకొచ్చింది. ఫొటోలో ఉన్న అగ్ర తారలను ప్రస్తావిస్తూ.. ‘వీళ్లందరూ ఎవెంజర్స్ అని నా పిల్లలకు చెబుతాను’ అని క్యాప్షన్ పెట్టారు.
…………………………………….